Glenn Maxwell : బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి
ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు తొలుత ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఇక అఫ్గాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ సుడిగాలి ఇన్సింగ్స్ ..
- Harish Thanniru
- Updated on- November 8, 2023 / 10:05 AM IST
Glenn Maxwell
ODI World Cup 2023 AUS vs AFG : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ జట్టు దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మాక్స్‌వెల్ ఒంటరిపోరాటం చేసి ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించాడు. 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ పై గెలుపుతో ఆసీస్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంకు చేరుకుంది. ఫలితంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు తొలుత ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఇక అఫ్గాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ సుడిగాలి ఇన్సింగ్స్ మ్యాచ్ ఫలితానే మార్చేసింది. తొడ కండరాల పట్టేసినా క్రీజులో నిలబడి సిక్సులు, ఫోర్లతో వాంఖడే స్టేడియాన్ని మాక్స్ వెల్ హోరెత్తించాడు. మ్యాక్స్ వెల్ బ్యాట్ తో సృష్టించిన సునామీకి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఓసారి వీక్షిస్తే చాలు మాక్స్ వెల్ ఎలాంటి అద్భుత ప్రదర్శన చేశాడో అర్థమవుతుంది.
