Ben Stokes : ఉపఖండంలో ఇదే గొప్ప విజయం.. ఉప్ప‌ల్‌లో గెలుపు పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌

త‌న కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జ‌ట్టు గెలిచిన మ్యాచుల్లో ఇదే అతి గొప్ప విజ‌యం అని బెన్ స్టోక్స్ అన్నాడు.

Our greatest triumph since I've been captain says Ben Stokes

England captain Ben Stokes : త‌న కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జ‌ట్టు గెలిచిన మ్యాచుల్లో ఇదే అతి గొప్ప విజ‌యం అని బెన్ స్టోక్స్ అన్నాడు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానంలో టీమ్ఇండియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ 28 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం పోస్ట్ మ్యాచ్ ప్ర‌జేంటేష‌న్‌లో బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకున్న‌ట్లు చెప్పాడు. తాను ఓట‌ముల‌కు భ‌య‌ప‌డ‌న‌ని అన్నాడు. గెలిచినా, ఓడినా కూడా త‌మ ఆట‌తీరులో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని బెన్‌స్టోక్స్ తెలిపాడు.

‘నేను కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జ‌ట్టుగా ఎన్నో అద్భుత‌మైన క్ష‌ణాలు చూశాం. కొన్ని చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌ను సాధించాం. అయితే.. వాటి అన్నింటిలో క‌న్నా ఈ విజ‌య‌మే 100 శాతం ఎంతో గొప్ప విజ‌యం.’ అని స్టోక్స్ చెప్పాడు. కెప్టెన్‌గా భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి అని, మొద‌టి ఇన్నింగ్స్‌లో ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నట్లు తెలిపాడు. భార‌త స్పిన్న‌ర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారో, వారి బౌలింగ్‌కు త‌గ్గ‌ట్లుగా రోహిత్ శ‌ర్మ ఎలా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడ‌నే విష‌యాల‌ను గ‌మ‌నించాను. అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

IND vs ENG : టీమ్ఇండియాకు షాక్‌.. ఉప్ప‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. హైద‌రాబాద్‌లో భార‌త్‌కు తొలి ఓట‌మి

ఈ విజ‌యం అంద‌రికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింద‌న్నాడు. అరంగ్రేట మ్యాచులోనే టామ్ హార్ట్లీ తొమ్మిది వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌, శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం వ‌చ్చిన మొద‌టి మ్యాచులోనే ఓలీ పోప్ భారీ శ‌త‌కం జ‌ట్టు నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నం అని అన్నాడు. హార్ట్లీ తొలిసారి జ‌ట్టులో రావ‌డంతో అత‌డికి ఓ విష‌యం మాత్ర‌మే చెప్పాను. ఏం జ‌రిగినా స‌రే త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని మాటిచ్చిన‌ట్లు వివ‌రించాడు.

ప్ర‌స్తుత జ‌ట్టులో రూటు, ఇంకా తాను మాత్ర‌మే ఉప ఖండంలో ఎక్కువ మ్యాచులు ఆడాము. ఓలీ పోప్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా చాలా త‌క్కువే అవుతుంద‌న్నాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చి అద్భుత‌మైన షాట్లు ఆడాడు అని కొనియాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 190 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న‌ప్ప‌టికీ ఏ మాత్రం అదైర్య ప‌డ‌కుండా స్వీప్‌, రివ‌ర్స్ స్వీప్ షాట్లుతో బౌల‌ర్ల ల‌య‌ను దెబ్బ‌తీశాడు.

తాను చూసిన వాటిల్లో ఓ ఇంగ్లీష్ ఆట‌గాడు ఉప‌ఖండ‌పు పిచ్‌ల‌పై ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అద్భుత‌మ‌ని చెప్పాడు.మ్యాచుల్లో గెలిచినా, ఓడినా త‌మ ఆట‌తీరు మార‌ద‌న్నాడు. తాను ఒక‌టి మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పాడు. జ‌ట్టులో ఉన్న‌వారికి మ‌ద్ద‌తుగా మాత్ర‌మే నిలుస్తాన‌ని చెప్పాడు.

WTC Points table : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు భారీ షాక్‌.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు..!

కాగా.. బెన్‌స్టోక్స్ కెప్టెన్సీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు 20 మ్యాచులు ఆడింది. ఇందులో 14 టెస్టుల్లో విజ‌యం సాధించింది. 5 మ్యాచుల్లో ఓడిపోగా, ఓ మ్యాచ్ డ్రా ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు