IND vs ENG : టీమ్ఇండియాకు షాక్‌.. ఉప్ప‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. హైద‌రాబాద్‌లో భార‌త్‌కు తొలి ఓట‌మి

హైద‌రాబాద్‌లో టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

IND vs ENG : టీమ్ఇండియాకు షాక్‌.. ఉప్ప‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. హైద‌రాబాద్‌లో భార‌త్‌కు తొలి ఓట‌మి

England beat India by 28 runs in Uppal test match

హైద‌రాబాద్‌లో టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ 28 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగులు చేయ‌గా భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 436 ప‌రుగులు చేసింది. భార‌త్ కు మొద‌టి ఇన్నింగ్స్‌లో 190 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. అయితే ఓలీ పోప్ (196) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 231 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (39), య‌శ‌స్వి జైస్వాల్ (15)లు తొలి వికెట్‌కు 42 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. య‌శ‌స్వి జైస్వాల్ ఔట్ కాగానే వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 42 ప‌రుగుల వ‌ద్దే రెండో వికెట్‌ను కోల్పోయింది.

Hardik Pandya : హార్దిక్ పాండ్య ఎమోష‌న‌ల్.. ‘ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా.. ఇది నా దేవాల‌యం’

మ‌రోవైపు ధాటిగా ఆడిన కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ(39) జ‌ట్టు స్కోరు 63 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ద‌శ‌లో కేఎల్ రాహుల్‌(22), అక్ష‌ర్ ప‌టేల్ (17) కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్‌కు 32 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన త‌రువాత అక్ష‌ర్ ప‌టేల్ ఔట్ అయ్యాడు. ఈ నాలుగు వికెట్లు కూడా టామ్ హార్ట్లీ నే ప‌డ‌గొట్టాడు.

ఈ ద‌శ‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్లు విజృంభించారు. దీంతో భార‌త్ 117 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కేఎస్ భ‌ర‌త్ (28) లు కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 57 ప‌రుగులు జోడించారు. మ‌రికాసేప‌ట్లో నాలుగో రోజు ముగుస్తుంద‌న‌గా భ‌ర‌త్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత భార‌త ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. ఆఖ‌రుకు 202 ప‌రుగుల‌కు భార‌త్ కుప్ప‌కూలింది. దీంతో 28 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో టామ్ హార్ట్లీ ఏడు వికెట్ల‌తో భార‌త ప‌త‌నాన్ని శాసించాడు జో రూట్‌, జాక్ లీచ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

AUS vs WI : చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్‌.. ఆ నిర్ణ‌యం వ‌ల్ల‌ చేజేతులా ఓడిన ఆస్ట్రేలియా..!

ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 2 నుంచి విశాఖ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.