×
Ad

Palash Muchhal : పలాష్‌ ముచ్చల్‌ తల్లి కీల‌క వ్యాఖ్య‌లు.. కాబోయే కోడ‌లు కాదు.. కొడుకే పెళ్లి ఆపేశాడు.. 4 గంట‌లు ఆస్ప‌త్రిలోనే..

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ (Palash Muchhal) వివాహం వాయిదా పడింది.

Palash Muchhal mother Amita revealed that her son was extremely attached to Smriti father

Palash Muchhal : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ వివాహం వాయిదా పడింది. ఆదివారం (న‌వంబ‌ర్ 23) వీరి వివాహం జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. వీరి వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న స్మృతి మంధాన తండ్రి గుండెపోటు ల‌క్ష‌ణాల‌తో ఇబ్బంది ప‌డ్డారు. వెంట‌నే ఆయ‌న్ను సాంగ్లీలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

తండ్రి చూడ‌ని వేడుక త‌న‌కు వ‌ద్దంటూ స్మృతి పెళ్లిని వాయిదా వేసిన‌ట్లుగా ఆమె మేనేజ‌ర్ తెలిపారు. మ‌రో వైపు ఆమెకు కాబోయే భ‌ర్త ప‌లాష్ ముచ్చ‌ల్ (Palash Muchhal) సైతం ఆస్ప‌త్రి పాలు అయ్యాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన‌ట్లుగా వార్తలు వ‌చ్చాయి.

Ravindra Jadeja : ద‌క్షిణాఫ్రికాపై టెస్టుల్లో జ‌డేజా వికెట్ల హాఫ్ సెంచ‌రీ.. ఐదో భార‌త బౌల‌ర్‌..

వీటిపై ప‌లాష్ ముచ్చ‌ల్ త‌ల్లి అమిత స్పందించింది. ఆమె హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. స్మృతి మంధాన తండ్రి అంటే ప‌లాష్‌కు ఎంతో ఇష్టమ‌ని చెప్పింది. ఆయ‌న‌తో పలాష్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉన్న‌ట్లు తెలిపింది. ఆయ‌న అనారోగ్యం బారిన ప‌డ్డార‌ని తెలియ‌గానే.. స్మృతి కంటే ముందుగానే ప‌లాష్ పెళ్లిని వాయిదా వేయాల‌ని కోరాడ‌ని చెప్పుకొచ్చింది. దీంతో ఆయ‌న కోలుకునేంత వ‌ర‌కు పెళ్లిని వాయిదా వేయాల‌ని అంతా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వెల్ల‌డించింది.

నాలుగు గంట‌లు ఆస్ప‌త్రిలో..

హ‌ల్దీ వేడుక జ‌రిగిన త‌రువాత నుంచి ప‌లాష్‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌లేద‌ని, స్మృతి తండ్రికి గుండెలో నొప్పి అనే విష‌యం తెలిసిన వెంట‌నే ప‌లాష్ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా చెప్పుకొచ్చింది. అత‌డు అలా చాలా సేపు ఏడ్చాడని, ఈ క్ర‌మంలోనే అత‌డి ఆరోగ్యం పాడైన‌ట్లుగా చెప్పింది.

T20 World Cup 2026 schedule : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2026 షెడ్యూల్ నేడే రిలీజ్.. భారత్, పాక్ మ్యాచ్ ఆ రోజేనా?

‘వెంట‌నే ప‌లాష్‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాం. దాదాపు నాలుగు గంట‌ల పాటు అత‌డిని ఆస్ప‌త్రిలో చికిత్స అందించారు. ఐవీ డ్రిప్‌ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాదార‌ణంగానే ఉన్నాయి.’ అని ప‌లాష్ త‌ల్లి వివ‌రించింది. ఇక ప‌లాష్‌.. ఇప్ప‌టికి కూడా ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నాడ‌ని అంది.