Hardik Pandya: హార్దిక్ పాండ్యా రూ.5కోట్ల విలువైన రిస్ట్ వాచీలు సీజ్.. ట్విట్టర్‌లో క్లారిటీ!
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
- vamsi
- Published On : November 16, 2021 / 12:04 PM IST
Hardhik
Hardik Pandya: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక్కో రిస్ట్ వాచీ విలువ రెండున్నర కోట్ల రూపాయలు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఓ ప్రకటన విడుదల చేశాడు.
నాతో తీసుకొచ్చిన బ్యాగేజీ గురించి తెలియజేయడానికి, అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేనే స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్ కౌంటర్‌కు వెళ్లాను. ఐదు కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, అయితే, వాచీల ధర 1.5 కోట్లు మాత్రమేనని తన ప్రకటనలో తెలిపారు.
హార్దిక్ పాండ్యా వద్ద ఈ వాచీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు లేవని, ఈ వాచీలను ప్రకటించలేదని కస్టమ్ అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హార్దిక్ కూడా కస్టమ్స్ ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, చెప్పారు.
హార్దిక్ పాండ్యాకు వాచీలంటే మోజు ఎక్కువే. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వాచీలు కొంటూ ఉంటారు. పటెక్ ఫిలిప్పె నాటిలస్ ప్లాటినమ్ 5711 రిస్ట్ వాచీని కూడా అతను కొన్నాడు.
Women Suspected Death : పెళ్లైన 16 రోజులకే నవ వధువు మృతి..దర్యాప్తులో సంచలన నిజాలు
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
