SRH : సన్‌రైజర్స్‌కు శుభవార్త.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోనే ఎస్ఆర్‌హెచ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు శుభవార్త అందింది.
- Thota Vamshi Kumar
- Published On : March 24, 2026 / 12:26 PM IST
Pat Cummins will join SRH squad in Bengaluru ahead of IPL 2026 season opener
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
- నేడు ఎస్ఆర్‌హెచ్ జట్టుతో చేరనున్న పాట్ కమిన్స్
- తొలి మ్యాచ్‌లో ఆడడం అనుమానమే!
SRH : మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదారాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న సన్‌రైజర్స్ జట్టు (SRH)ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టారు.
అయితే.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరం అవుతాడని భావిస్తున్న కెప్టెన్ కమిన్స్ వచ్చేస్తున్నాడు. అతడు నేడు (మంగళవారం మార్చి 24)న బెంగళూరులో జట్టుతో చేరనున్నాడు.
BCCI : ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కొత్త రూల్స్.. జబ్బలు కనపడ్డాయో..
అయితే.. కమిన్స్ జట్టుతో చేరినప్పటికి కూడా అతడు తొలి మ్యాచ్‌లో ఆడతాడో లేదో అన్న విషయం పై ప్రస్తుతానికి స్పష్టత లేదు. క్రిక్‌బజ్ ప్రకారం కమిన్స్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించే వరకు మ్యాచ్‌లు ఆడడు. అప్పటి వరకు ఇషాన్ కిషన్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఆడనుంది.
మలింగకు ఎన్ఓసీ వచ్చేసింది..
సన్‌రైజర్స్ జట్టులో శ్రీలంక స్టార్ పేసర్ ఎషాన్ మలింగ చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గాయం నుంచి కోలుకున్న అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో లంక క్రికెట్ బోర్డు అతడు ఐపీఎల్లో పాల్గొనేందుకు ఎన్ఓసీ ఇచ్చింది. దీంతో అతడు ఒకటి లేదా రెండు రోజుల్లో జట్టుతో చేరనున్నాడు. గతేడాది అతడు 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు.
