BCCI : ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కొత్త రూల్స్.. జబ్బలు కనపడ్డాయో..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
BCCI imposes new rules for IPL 2026
- మార్చి 28 నుంచి ఐపీఎల్
- కొత్త రూల్స్‌కు తీసుకువచ్చిన బీసీసీఐ
BCCI : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అయితే.. రూల్స్ ప్రేక్షకులు, మ్యాచ్‌లకు సంబంధించినవి కాదు. ఆటగాళ్లకు, ఫ్రాంఛైజీలకు మాత్రమే. ఒకవేళ ఈ రూల్స్ ప్లేయర్లు గానీ, ఫ్రాంఛైజీలు గానీ అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక పై మ్యాచ్ రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లకు అనుమతి ఉండదని తెలిపింది. అంతేకాదండోయ్.. మ్యాచ్ జరిగే రోజుల్లో మైదానంలో ఫిట్నెస్ పరీక్షలను నిషేదించింది.
ప్రాక్టీస్ రూల్స్..
ఓపెన్ నెట్స్‌కు అనుమతి లేదు. నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక జట్టు ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్లను మరో జట్టు వాడకూడదు. అంటే.. ఉదయం టీమ్ ఏ ఉపయోగించిన పిచ్ పై సాయంత్రం టీమ్ బి సాధన చేయకూడదు. మ్యాచ్ రోజున ప్రాక్టీస్‌కు అనుమతి లేదు. అలాగే.. మ్యాచ్ రోజున గ్రౌండ్లో ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలకు నిర్వహించకూడదు.
Mithali Raj : పసుపు చీరలో భారత మాజీ మహిళా క్రికెటర్.. మిథాలీ రాజ్ ఎంత క్యూట్‌గా ఉందో..
ఇక ప్రాక్టీస్ రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి ఆటగాళ్లతో పాటు గుర్తింపు పొందిన సిబ్బందినే అనుమతిస్తారు. ఇక ప్లేయర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనాల్లో రావాల్సి ఉంటుంది. వారికి మైదానంలోకి ఎంట్రీ ఉండదు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి మాత్రమే వారు ప్రాక్టీస్‌ను వీక్షించాలి. అన్ని ఫ్రాంఛైజీలు కూడా త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు, నెట్ బౌలర్ల జాబితా వివరాలను బీసీసీఐకి ముందే సమర్పించాలి. ఇక ప్లేయర్లు ప్రాక్టీస్‌కు వచ్చేటప్పుడు టీమ్ బస్సులను మాత్రమే ఉపయోగించాలి. రెండు బృందాలుగా వారు ప్రయాణించవచ్చు. మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్, ఫిట్నెస్ టెస్టుకు సంబంధించి ఎలాంటి అభ్యర్థన వచ్చిన స్థానిక మేనేజర్‌ను సంప్రదించాలి.
మ్యాచ్ రోజు నిబంధనలు ఇవే..
సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు పత్రాన్ని తీసుకురావాలి. తొలిసారి అక్రిడిటేషన్ కార్డు మరిచిపోతే హెచ్చరికతో సరిపెడతారు. అయితే.. రెండోసారి ఇలాంటి తప్పు చేస్తే అప్పుడు భారీ జరిమానా విధిస్తారు. ఎల్ఈడీ బోర్డుల వైపు బంతిని కొట్టకుండా ప్రయత్నించాలని బీసీసీఐ ఆటగాళ్లను కోరింది. ఎల్ఈడీ బోర్డుల ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూర్చోవడానికి అనుమతి లేదు.
ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్స్ ఆటగాళ్లు ఆయా రంగు టోఫీలను ధరించాలి. కనీసం రెండు ఓవర్ల పాటు, ప్రసారంలో కనిపించేంత వరకు ఆ క్యాప్‌లను ధరించాలి. ఇక మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆటగాళ్లు ఫ్లాప్పీ హ్యాట్స్, స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు. ఒకవేళ ఉల్లంఘిస్తే తొలిసారి హెచ్చరిక జారీ చేస్తారు, రెండో సారి జరిమానా విధిస్తారు. ఐపీఎల్ 2025లో లాగానే మ్యాచ్ రోజున డాక్టర్‌తో కలిపి కేవలం 12 మంది సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో ఏదైన మార్పు ఉన్నట్లయితే.. 24 గంటల ముందే ఆ సమాచారాన్ని బీసీసీఐకి తెలియజేయాల్సి ఉంటుంది.
