Babar Azam : నువ్వు ఎక్కడ దొరికావ్ రా సామీ.. యాడ్ షూట్‌లోనూ క్యాచ్ మిస్.. బాబర్ ఆజామ్ పై ట్రోలింగ్..
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లలో బాబర్ ఆజామ్ (Babar Azam ) ఒకడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 28, 2026 / 02:38 PM IST
PSL 2026 Viral Video Shows Babar Azam Dropping Catch During Ad Shoot
Babar Azam : పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లలో బాబర్ ఆజామ్ ఒకడు. అయితే.. గత కొంతకాలంగా అతడు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి పై విమర్శల జడివాన కొనసాగుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో పెషావర్ జల్మీ తరుపున ఆడుతున్నాడు.
పీఎస్ఎల్ గురువారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజామ్ ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కోహ్లీ కన్ను..
కుడిచేతి వైపు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవాలని బాబర్ ఆజమ్‌ను కోరారు. డైవ్ చేసినప్పుడు అతడికి ఏం కాకూడదని కింద ఒకదానిపై మరొకటి రెండు పరుపులు వేశారు. అయితే.. బాబర్ ఆజామ్ తన కుడి చేతి వైపు డైవ్ చేసినప్పటికి కూడా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. పాక్ క్రికెట్ అభిమానులు అతడిపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Ishan Kishan : ఆర్‌సీబీతో మ్యాచ్.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న ఇషాన్ కిషన్..
బంతి ఎక్కడ పడుతుంది? ఎంత వేగంతో వస్తుంది? వస్తుంది అన్న సంగతి తెలుసు.. సరిగ్గా అక్కడే పరుపులు కూడా ఉన్నాయి. అయిన్పపటికి కూడా బాబర్ బంతిని పట్టుకోలేకపోయాడు. ఏం చేస్తాం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, బాబర్ ఆజామ్ క్యాచ్ మిస్ చేస్తాడని పరుపు కంపెనీకు కూడా తెలుసునని, అందుకనే సరిగ్గా వారు కూడా అక్కడే పరుపులు వేశారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఒకవేళ పరువు లేకపోయి ఉంటే అతడికి గాయం అయి ఉండేదని, అలా జరిగి ఉంటే ఓ ఏడాది పాటు అతడు ఆడలేకపోయేవాడు అంటూ మరోనెటిజన్ అన్నాడు.
