PV Sindhu : సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌ కైవసం.. తొలి భారత షట్లర్‌గా ఘనత

PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ సరికొత్త చరిత్ర సృష్టించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీవిజేతగా నిలిచింది.

PV Sindhu

PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి తన కెరీర్‌లో మొట్టమొదటి జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్ స్టార్ అకానే యమగుచిపై వరుస గేమ్‌లలో సింధూ విజయం సాధించి.. ట్రోఫీని గెలుచుకుంది.

Also Read : Rohit Sharma : వార్నీ.. లార్డ్స్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డు ఇంత ద‌రిద్రంగా ఉందా? ఇక అంతే సంగ‌తి..

ఫైనల్ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు.. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారణి అకానేకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన స్మాష్‌లు, వేగవంతమైన రిటర్న్‌లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని సింధు చెలాయించింది. రెండు గేమ్‌లలోనూ 21-17, 21-17 తేడాతో మెరుగైన ఆటతో విజయం అందుకుంది. ప్రతీ గేము చివరి వరకూ హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ ను ముగించింది.

గత రెండు సీజన్లుగా వరుసగా గాయాలబారిన పడటంతో పీవీ సింధు తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడింది. దాదాపు 19 నెలలుగా ఆమె ఒక్క అంతర్జాతీయ టూర్ టైటిల్ కూడా గెలవలేక పోయింది. చివరిగా డిసెంబర్ 2024‌లో స్వదేశంలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధుకు మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయి విజయం దక్కింది. మేజర్ టైటిల్స్ పరంగా చూస్తే 2022 సింగపూర్ ఓపెన్ సూపర్ 500 తరువాత సింధు సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.