R Praggnanandhaa : చ‌రిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన ఏకైక భార‌తీయుడు..

భార‌త యువ గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) అరుదైన ఘ‌నత సాధించాడు.

R Praggnanandhaa scripts history first Indian to win Grand Chess Tour

R Praggnanandhaa : భార‌త యువ గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘ‌నత సాధించాడు. గ్రాండ్ చెస్ టూర్ విజేత‌గా నిలిచిన మొద‌టి భార‌తీయుడిగా చ‌రిత్ర సృష్టించాడు. గురువారం సెయింట్ లూయిస్‌లో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై 15-13 తేడాతో విజేత‌గా నిలిచాడు. దాదాపు 2 కోట్ల ప్రైజ్‌మ‌నీని సొంతం చేసుకున్నాడు. అంతేకాదండోయ్ వ‌చ్చే ఏడాది (2027)లో జ‌రిగే గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హ‌త సాధించాడు.

ఆఖ‌రి రోజు ఆట ప్రారంభంలో ప్రజ్ఞానంద 6 పాయింట్ల వెనుకంజ‌లో ఉన్నాడు. అయితే.. అద్భుతంగా పుంజుకున్నాడు. వ‌రుగాస రెండు ర్యాపిడ్ గేమ్‌ల‌లో విజ‌యాలు సాధించి ఆధిక్యంలోకి వ‌చ్చాడు. ఈ టోర్నీలో ఆరు గేముల్లో ప్రజ్ఞానంద మూడు విజయాలు సాధించగా, రెండు డ్రాలు, ఒక ఓటమిని నమోదు చేశాడు.

Sara Tendulkar : జాతీయ కుక్కల దినోత్సవం.. స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్‌..

నిజం చెప్పాలంటే తాను గెలిచే అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అనుకోలేద‌న్నాడు. ఆరు పాయింట్లు వెన‌క‌బ‌డి ఉండ‌డ‌మే అందుకు కార‌ణం అని చెప్పుకొచ్చాడు. ఇలాంటప్పుడే ఎలా ఆడాలో చూపించాన‌ని, ఫాబి వంటి ఆట‌గాడిపై ఒక్క మ్యాచ్ గెల‌వ‌డ‌మే చాలా క‌ష్టమ‌ని, అలాంటిది ర్యాపిడ్‌లో రెండు గేమ్‌ల‌లో విజ‌యం సాధించ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. గ‌త ఏడాది నుంచి త‌న ర్యాపిడ్‌, బ్లిట్జ్ గేమ్‌లో చాలా మార్పులు చేసుకున్న‌ట్లుగా తెలిపాడు. ఆ ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తుంద‌న్నాడు.