Rahul Chahar
Rahul Chahar : భారత క్రికెటర్లలో భార్యలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే హార్థిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల యుజ్వేంద్ర చహల్ కూడా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నాడు. తాజాగా వారిబాటలో మరో టీమిండియా క్రికెటర్ చేరాడు. భాత యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) తన వివాహ జీవితానికి ముగింపు పలికినట్లు వెల్లడించాడు.
Also Read : T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్ 8 ఫార్మాట్ పై ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది?
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్లేయర్ రాహుల్ చాహర్ తన నాలుగేళ్ల పెండ్లి బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో భావోద్వేగ ఫోస్టు చేశారు. తన నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు పేర్కొన్నాడు.
రాహుల్ చాహర్ 2022లో మార్చి 9న గోవాలో ఈషానీ జౌహర్ ను పెండ్లి చేసుకున్నాడు. ఇరువురి కుటుంబాల సభ్యుల సంక్షమంలో దీపక్ చాహర్, ఈషానీ వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పెండ్లి సమయానికి అతనికి కేవలం 22ఏళ్లు మాత్రమే. అప్పట్లో ఈ పెండ్లి క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
పెండ్లి సమయానికి రాహుల్ ఐపీఎల్‌లో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్లో స్థిరమైన స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. 2019ఆగస్టు 6న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత తరపున అతను అరంగేట్రం చేశాడు. మొత్తం ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2021 నవంబర్ 8న భారత జెర్సీలో చివరిసారిగా రాహుల్ కనిపించాడు. 2026లో రాహుల్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు.
రాహుల్ చాహర్ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లుగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. ‘మేము చాలా చిన్న వయస్సులోనే పెండ్లి చేసుకున్నాం. అప్పటికి మా జీవితాల విలువ, బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తరువాత ఊహించని పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా 15 నెలలుగా కోర్టు చుట్టూ తిరగడం, సహనం, అనుకూలంగా మార్చడం, నిజాన్ని అంగీకరించే ధైర్యం నేర్చుకున్నాను. సరైన న్యాయ ప్రక్రియ అనంతరం విడాకుల వ్యవహారం ముగిసింది. దీనికి తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ అధ్యాయాన్ని కోపం లేదా పశ్చాత్తాపంతో కాకుండా స్పష్టతతో ముగిస్తున్నాను’ అంటూ రాహుల్ పేర్కొన్నాడు.