Rahul Dravid : ఇంకో ఏడాదా..? అస్సలు వద్దు.. టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తెలుసా..?
Rahul Dravid not intrested as a coach : టీమ్ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవి కాలం ముగిసింది.
- Thota Vamshi Kumar
- Published On : November 23, 2023 / 06:39 PM IST
Rahul Dravid
టీమ్ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవి కాలం ముగిసింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌తో అతడి కాంట్రాక్ట్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవిడ్ సరేనంటే మరో ఏడాది పాటు అతడి కాంట్రాక్టును పొడిగించాలని బీసీసీఐ భావించిందట. అయితే.. ఇందుకు ద్రవిడ్ అంగీకరించలేదని తెలుస్తోంది.
ద్రవిడ్ మార్గనిర్దేశంలో టీమ్ఇండియా ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్, డబ్ల్యూటీసీ పైనల్, వన్డే ప్రపంచకప్ 2023 పైనల్ మ్యాచుల్లో టీమ్ఇండియా ఓడిపోయింది. మెగా టోర్నీలను గెలవనప్పటికీ ద్రవిడ్ హయాంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలలో నంబర్ వన్‌గా కొనసాగింది. ఎంతో మంది యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. ద్వైపాకిక్ష సిరీస్‌ల్లో అద్భుత విజయాలు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకువెళ్లింది. అయితే.. ఫైనల్ మ్యాచ్ ఒక్కటే కలిసి రాలేదు.
T20 World Cup 2024 : టీ20లకు హార్దిక్‌పాండ్య కెప్టెన్‌గా వద్దు.. అందుకు సరైనోడు అతడే : గంభీర్
అతడే తదుపరి కోచ్..
కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ కు ఆసక్తి లేకపోవడంతో టీమ్ఇండియా హెచ్ కోచ్‌గా ఎవరిని నియమించాలని అన్నదానిపై బీసీసీఐ చాలా క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం లక్ష్మణ్ మార్గనిర్దేశ్యంలోనే భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో అతడి గైర్హజరీలో లక్ష్మణ్ టీమ్ఇండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కాగా.. లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్‌గా ఉన్నాడు.
లక్ష్మణ్ హెడ్ కోచ్ విధుల్లో చేరిన తరువాత ఎన్‌సీఏ చీఫ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఓ ఐపీఎల్ జట్టుతోనూ జత కలిసే ఆలోచనలో ద్రవిడ్ ఉన్నాడు అనే టాక్ నడుస్తోంది. ద్రవిడ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియనప్పటికీ కొత్త కోచ్‌గా లక్ష్మణ్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది.
