IPL 2023, KKR vs RR: దంచికొట్టిన జైస్వాల్.. కోల్‌కతాపై రాజస్థాన్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఘన విజయం సాధించింది.
- Thota Vamshi Kumar
- Published On : May 11, 2023 / 10:51 PM IST
Rajasthan Royals win
IPL 2023, KKR vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో బట్లర్ డకౌట్ కాగా మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(98 నాటౌట్; 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.
అతడికి తోడు కెప్టెన్ సంజు శాంసన్ (48 నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ అలవోకగా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా కోల్‌కతా అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
IPL 2023, KKR vs RR: జైస్వాల్ విధ్వంసం.. కోల్‌కతాపై రాజస్థాన్ ఘన విజయం
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(57; 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు పర్వాలేనిపించగా జేసన్ రాయ్(10), రస్సెల్ (10) లు విఫలం అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శర్మ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని తన పేరున లిఖించుకున్నాడు. 13 బంతుల్లోనే జైస్వాల్ ఈ ఘనతను సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్(14 బంతుల్లో) పేరిట ఉండేది.
