Rajat Patidar : ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్.. 100 సిక్సర్ల వీరుడు.. ఏకైక భారత ఆటగాడు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 23, 2026 / 08:54 AM IST
Rajat Patidar creates history to became fatest indian batter to hit 100 sixes in IPL (pic credit@ipl)
- ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరిన రజత్ పాటిదార్
- ఈ ఘనత అత్యంత వేగంగా సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర
Rajat Patidar : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 100 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో హర్షల్ పటేల్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఈ ఘనతను సాధించాడు.
ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి పాటిదార్‌కు 933 బంతులు బంతులు అవసరం అయ్యాయి. ఇంతకముందు ఈ రికార్డు శివమ్ దూబె పేరిట ఉంది. అతడు 100 సిక్సర్లు కొట్టేందుకు 992 బంతులు తీసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాటిదార్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు.
Travis Head vs Virat Kohli : హెడ్‌తో గొడవ..! షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రజత్ పాటిదార్ 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 100 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* ఆండ్రీ రస్సెల్ – 657 బంతులు
* నికోలస్ పూరన్ – 884 బంతులు
* రజత్ పాటిదార్ – 933 బంతులు
* క్రిస్ గేల్ – 943 బంతులు
* సునీల్ నరైన్ – 950 బంతులు
* శివమ్ దూబె – 992 బంతులు
ఇక ఆర్‌సీబీ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో రజత్ పాటిదార్ నిలిచాడు. తొలి స్థానంలో కోహ్లీ ఉండగా ఆ తరువాత గేల్, డివిలియర్స్ ఉన్నాడు.
ఆర్‌సీబీ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 312 సిక్సర్లు
* క్రిస్ గేల్ – 239 సిక్సర్లు
* ఏబీ డివిలియర్స్ – 238 సిక్సర్లు
* రజత్ పాటిదార్ – 100 సిక్సర్లు
* ఫాఫ్ డుప్లెసిస్ – 70 సిక్సర్లు.
