Travis Head vs Virat Kohli : హెడ్‌తో గొడవ..! షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇవ్వగా (Travis Head vs Virat Kohli ) అతడిని పట్టించుకోకుండా కోహ్లీ ముందుకు వెళ్లిపోయాడు.
IPL 2026 Virat Kohli refuses handshake with Travis Head after SRH vs RCB match
- ఆర్సీబీ పై సన్‌రైజర్స్ విజయం
- మ్యాచ్ అనంతరం హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ
Travis Head vs Virat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇవ్వగా.. అతడిని పట్టించుకోకుండా కోహ్లీ ముందుకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాట్ కమిన్స్, ఇషాన్ కిషన్లతో కరచాలనం చేసిన కోహ్లీ ఆ వెనుకే ఉన్న హెడ్‌తో కరచాలనం చేయలేదు. హెడ్ వెనుక ఉన్న అభిషేక్ శర్మతో పాటు మిగిలిన ఆటగాళ్లతో కరచాలనం చేయడం వీడియోలో కనిపించింది.
కారణం అదేనా?
ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను ఎస్ఆర్హెచ్ బౌలర్ శివాంగ్ కుమార్ వేశాడు. ఈ ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ సమయంలో హెడ్ ఏదో అన్నాడు. వెంటనే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ నువ్వు వచ్చి బౌలింగ్ చేయి, ఇంపాక్ట్ సబ్ నువ్వు అన్నట్లుగా సైగలు చేయడం లైవ్‌లో కనిపించింది.
అంతకముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో ట్రావిస్ హెడ్ ఔట్ అయిన సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79 పరుగులు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51 పరుగులు) అర్థశతకాలు చేశారు. బెంగళూరు బౌలర్లలో రసిఖ్ సలాం దార్ రెండు, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యాలు చెరో వికెట్ తీశారు.
🔴Virat Kohli not happy with Travis Head for that reaction 🤯🥵
– yelled at him while at the crease.
– frustrated at the dugout.
– No handshakes after the match 🤯🗿 pic.twitter.com/T0TcwFnimu— ‘HK’ (@potter_here18) May 22, 2026
ఆ తరువాత 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. రజత్ పాటిదార్ (56) అర్ధశతకం బాదాడు. వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44 పరుగులు) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్లు తలా ఓ వికెట్ తీశారు,
