Asia Cup 2023 : భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రభాస్ పాట.. బౌండరీ కొట్టిన ప్రతిసారి..!
ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఫలితం సంగతి కాసేపు పక్కన బెడితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు బౌండరీలు బాదిన ప్రతి సారీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలోని ఓ పాటను డీజే ప్లే చేయడం విశేషం.
- Thota Vamshi Kumar
- Updated on- September 3, 2023 / 04:47 PM IST
Ram Siya Ram song plays After Every Indian Boundary
Asia Cup 2023 : భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం పల్లెకలె వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఫలితం సంగతి కాసేపు పక్కన బెడితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు బౌండరీలు బాదిన ప్రతి సారీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలోని ఓ పాటను డీజే ప్లే చేయడం విశేషం. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (హిందీ వెర్షన్) చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ అంటూ సాగే సాంగ్‌ను ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌలైంది. రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4), శ్రేయస్ అయ్యర్ (14) లు విఫలం అయ్యారు. అయితే.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Heath Streak : బతికే ఉన్నానన్న 10 రోజులకే.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత..
కాగా.. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడింది. ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ సూపర్ 4 అర్హత సాధించింది. టీమ్ఇండియా సూపర్ 4కు అర్హత సాధించాలంటే నేపాల్‌ను ఓడించాల్సి ఉంటుంది.
