×
Ad

Rashid Khan : చ‌రిత్ర సృష్టించిన ర‌షీద్ ఖాన్‌.. టీ20 క్రికెట్‌లో ఏకైక బౌల‌ర్‌..

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rashid Khan becomes the first player to reach the milestone of 700 T20 wickets

Rashid Khan : అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈతో మ్యాచ్‌లో ఓ వికెట్ ప‌డ‌గొట్ట‌డం ద్వారా ర‌షీద్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. కాగా.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన వీరుడిగా ర‌షీద్ ఖాన్ కొన‌సాగుతున్నాడు.

యూఏఈతో మ్యాచ్‌కు ముందు ర‌షీద్ ఖాన్ 699 వికెట్లు ప‌డ‌గొట్టాడు. యూఏఈతో మ్యాచ్‌లో అత‌డు ముహమ్మద్ అర్ఫాన్ ను ఎల్భీడ‌బ్ల్యూగా ఔట్ చేయ‌డం ద్వారా అత‌డు 700 వికెట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు. 512 ఇన్నింగ్స్‌ల్లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

IND vs PAK : నా అల్లుడిని జ‌ట్టులోంచి తీసేయండి.. అప్పుడే పాక్ గెలుస్తుంది.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీ20 క్రికెట్ అత్య‌ధిక వికెట్లు తీసింది వీరే..

* ర‌షీద్ ఖాన్ – 517 మ్యాచ్‌ల్లో 700* వికెట్లు
* డ్వేన్ బ్రావో – 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు
* సునీల్ న‌రైన్ – 583 మ్యాచ్‌ల్లో 613 వికెట్లు
* ఇమ్రాన్ తాహిర్ – 448 మ్యాచ్‌ల్లో 572 వికెట్లు
* ఆండ్రీ ర‌స్సెల్ – 590 మ్యాచ్‌ల్లో 508 వికెట్లు
* ష‌కీబ్ అల్ హ‌స‌న్ – 470 మ్యాచ్‌ల్లో 507 వికెట్లు