IND vs ENG : రాజ్‌కోట్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. భార్య రివాబా ఆసక్తికర ట్వీట్
రాజ్‌కోట్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనపై భార్య రివాబా ఆసక్తికర ట్వీట్ చేశారు.
- Harish Thanniru
- Updated on- February 19, 2024 / 10:47 AM IST
Ravindra Jadeja Wife Rivaba
Ravindra Jadeja : రాజ్‌కోట్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇదిలాఉంటే.. ఈ టెస్టు మ్యాచ్ లో జడేజా మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో టెస్టుల్లో అశ్విన్ 500 వ వికెట్ తీయగా.. రెండో ఇన్నింగ్స్ లో జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లోకి చేరిపోయాడు.
Also Read : Arjun Tendulkar : సత్తా చాటుతున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు
టీమిండియా మూడో టెస్టులో అద్భుత విజయం సాధించడంతో జడేజా సతీమణి, ఎమ్మెల్యే రివాబా తన ట్విటర్ ఖాతాలో టీమిండియాకు అభినందనలు తెలిపారు. ట్విటర్ లో రవీంద్ర జడేజా ఫొటోను పంచుకున్న రివాబా.. రాజ్‌కోట్‌లో నా భర్త రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంగ్లండ్ జట్టుపై అద్భుత విజయం సాధించిన టీమిండియా సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలను రివాబా తెలిపారు.
Also Read : IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో టీమ్ఇండియా రాజసం.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం
ఇంగ్లాండ్ తో మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 12.4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు మెయిడిన్ ఓటర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా 434 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాల్గో టెస్ట్ మ్యాచ్ రాంచీ వేదికగా ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు జరగనుంది.
