Arjun Tendulkar : సత్తా చాటుతున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు

బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ అర్జున్ టెండూల్కర్ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో అతను

Arjun Tendulkar : సత్తా చాటుతున్న సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు

Arjun Tendulkar

Arjun Tendulkar Best Bowling : సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తున్నాడు. గుజరాత్ తో జరిగిన రంజీ ట్రోపీ మ్యాచ్ లో కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. రంజీట్రోపీలో గోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. గుజరాత్ పై 21 ఓవర్లలోనే 4/49తో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు మెయిడిన్ లు కూడా ఉన్నాయి.

Also Read : IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో టీమ్ఇండియా రాజ‌సం.. ఇంగ్లాండ్‌పై భారీ విజ‌యం

బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ అర్జున్ టెండూల్కర్ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో అతను 16 వికెట్లు తీసుకున్నాడు. అర్జున్ పేరుపై ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అర్జున్ అవకాశం దక్కినప్పుడల్లా బ్యాటింగ్ లోనూ తన సత్తాను చూపుతున్నాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోపీలో గోవా ప్రస్తుతం ఆరు మ్యాచ్ ల తరువాత ఎటువంటి విజయాలు సాధించకుండా దిగువ స్థానంలో ఉంది. మొత్తంగా కేవలం నాలుగు పాయింట్లతోనే ప్లేఆప్ కు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Also Read : Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ విధ్వంసక‌ర డ‌బుల్ సెంచరీ.. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లోనూ..

ఈ మ్యాచ్ లో గుజరాత్ మొదటి ఇన్నింగ్స్ 346 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన గోవా తొలి ఇన్నింగ్స్ లో 317 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, అర్జున్ టెండూల్కర్ 45 పరుగులు చేశాడు. 2023లో జరిగిన ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడిన అర్జున్ తనదైన ముద్రవేయలేకపోయాడు. 2024లో జరిగే ఐపీఎల్ లోనూ ఆడేందుకు అర్జున్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీల్లో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు.