Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ విధ్వంసక‌ర డ‌బుల్ సెంచరీ.. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లోనూ..

టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ విధ్వంసక‌ర డ‌బుల్ సెంచరీ.. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లోనూ..

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal Double century : టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన జైస్వాల్.. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ ద్విశ‌త‌కాన్ని అందుకున్నాడు.

జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు సాయంతో డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. య‌శ‌స్వి టెస్టు కెరీర్‌లో అత‌డికి ఇది రెండో ద్విశ‌త‌కం కావ‌డం విశేషం.

Mike Procter : క్రికెట్ ప్ర‌పంచంలో పెను విషాదం.. దిగ్గజ ఆట‌గాడు కన్నుమూత

వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లోనూ డ‌బుల్ సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

తాజా ద్విశ‌త‌కంతో య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో ఘ‌న‌త అందుకున్నాడు. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన మూడో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అత‌డి కంటే ముందు వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ లు మాత్ర‌మే ఇలా వ‌రుస‌గా రెండు టెస్టుల్లోనూ ద్విశ‌త‌కాలు చేశారు.

వినోద్ కాంబ్లీ – ముంబైలో ఇంగ్లాండ్ పై 224 ప‌రుగులు, ఢిల్లీలో జింబాబ్వ‌పై 227 ప‌రుగులు(1992/93)
విరాట్ కోహ్లీ – నాగ్‌పూర్‌లో శ్రీలంక పై 213 ప‌రుగులు, ఢిల్లీలో శ్రీలంక‌పై 243 ప‌రుగులు (2017/18)
య‌శ‌స్వి జైస్వాల్ – విశాఖ‌లో ఇంగ్లాండ్ పై 200 నాటౌట్, రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ పై 214* (2023/24)

రెండో ఇన్నింగ్స్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..
ప‌టౌడీ – 203 ప‌రుగులు – ఢిల్లీలో ఇంగ్లాండ్ పై (1964)
స‌ర్దేశాయ్ – 200* – ముంబైలో విండీస్ పై (1965)
సునీల్ గ‌వాస్క‌ర్ – 220 – పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ పై (1971)
సునీల్ గ‌వాస్క‌ర్ – 221 – ఓవ‌ల్‌లో ఇంగ్లాండ్‌ పై (1979)
వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ – 281 – కోల్‌క‌తాలో ఆస్ట్రేలియాపై (2001)
వ‌సీం జాఫ‌ర్ – 212 – సెయింట్ జాన్స్‌లో వెస్టిండీస్ పై (2006)
యశస్వి జైస్వాల్ – 214* – రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ పై (2024)

Shubman Gill : అయ్యో గిల్‌.. కుల్దీప్ ఎంత ప‌ని చేశావ‌య్యా..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగులు చేయ‌గా బ‌దులుగా ఇంగ్లాండ్ 319 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు కీల‌క‌మైన 126 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ను భార‌త్ ఆరంభించింది. య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డంతో 430/4 వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యం నిలిచింది.