Shubman Gill : అయ్యో గిల్‌.. కుల్దీప్ ఎంత ప‌ని చేశావ‌య్యా..

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

Shubman Gill : అయ్యో గిల్‌.. కుల్దీప్ ఎంత ప‌ని చేశావ‌య్యా..

Shubman Gill livid as he gets run out in 90s after mix-up with Kuldeep Yadav

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. శ‌త‌కానికి తొమ్మిది ప‌రుగుల దూరంలో ర‌నౌట్ గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో రెండో సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 151 బంతుల‌ను ఎదుర్కొన్న గిల్ 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 91 ప‌రుగులు చేశాడు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సెంచ‌రీ చేసిన సంగ‌తి తెలిసిందే.

టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్ వైడ్ మిడాన్ దిశ‌గా షాట్ ఆడాడు. దీంతో ప‌రుగు తీయాల‌ని భావించాడు. ద‌గ్గ‌ర‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ స్టోక్స్ మెరుపు వేగంతో బంతిని అందుకుని బౌల‌ర్ టామ్ హార్డ్లీ వైపు విసిరాడు. అప్ప‌టికే ప‌రుగు కోసం పిచ్ స‌గం మ‌ధ్య‌కు వెళ్లాడు గిల్‌. అయితే.. కుల్దీప్ యాద‌వ్ వ‌ద్ద‌ని చెప్ప‌డంతో తిరిగి వెన‌క్కి మ‌ళ్లాడు. క్రీజుకు చాలా దూరం ఉండ‌డంతో డైవ్ చేశాడు.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. బంతిని అందుకున్న హార్డ్లీ వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో గిల్ ర‌నౌట్ అయ్యాడు. శ‌త‌కానికి తొమ్మిది ప‌రుగుల దూరంలో ఔట్ కావ‌డంతో గిల్ కు నిరాశ త‌ప్ప‌లేదు. దీంతో అత‌డు కుల్దీప్ వైపు కోపంగా చూస్తుకుంటూ పెవిలియ‌న్‌కు వెళ్లాడు. త‌న కార‌ణంగానే గిల్ ర‌నౌట్ అయ్యాడ‌ని కుల్దీప్ పిచ్ పై మోకాళ్ల పై కూర్చుండిపోయాడు.

బుమ్రా వచ్చాడంటే జో రూట్ పెవిలియన్ బాట పట్టాల్సిందే.. ఎందుకంత భయం!

గిల్ ఔట్ కావ‌డంతో రిటైర్ హార్ట్‌గా వెనుదిరిగిన ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (104 రిటైర్ హార్ట్; 133బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) క్రీజులోకి వ‌చ్చాడు. కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెలుతున్నాడు. ప్ర‌స్తుతానికి భార‌త్ స్కోరు 68 ఓవ‌ర్ల‌లో 250/3. జైస్వాల్ (107), కుల్దీప్ యాద‌వ్ (27) లు క్రీజులో ఉన్నారు.

Sarfaraz Khan : రోహిత్ పై అభిమానం.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర ఫొటో