Sarfaraz Khan : రోహిత్ పై అభిమానం.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర ఫొటో

సర్ఫరాజ్ ఖాన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అంటే ఎంతో అభిమానం. రోహిత్ తన ఫేవరెట్ ప్లేయర్ అని గతంలో పలుసార్లు వెల్లడించాడు.

Sarfaraz Khan : రోహిత్ పై అభిమానం.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర ఫొటో

Sarfaraz Khan

Updated On : February 18, 2024 / 8:19 AM IST

Sarfaraz Khan – Rohit Sharma : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ మ్యాచ్ లో యువ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. దీంతో సర్ఫరాజ్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సర్ఫరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు.

Also Read : IND vs ENG 3rd Test : మూడో టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. జైస్వాల్ సెంచ‌రీ.. 322 ప‌రుగుల ఆధిక్యం

సర్ఫరాజ్ ఖాన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అంటే ఎంతో అభిమానం. రోహిత్ తన ఫేవరెట్ ప్లేయర్ అని గతంలో పలుసార్లు వెల్లడించాడు. రోహిత్ శర్మ ఫుల్ షాట్, ఆయన డబుల్ సెంచరీల గురించి తమ డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లమని సర్ఫరాజ్ ఖాన్ చెప్పాడు. తాజాగా రోహిత్ శర్మతో కలిసిఉన్న చిత్రాన్ని తన ఇన్ స్టాస్టోరీలో షేర్ చేశాడు. రోహిత్ ను కౌగిలించుకున్న సమయంలో సంతోషకరమైన చిత్రాన్ని తన ఇన్ స్టా స్టోరీలో ఉంచి రోహిత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.