IND vs ENG 3rd Test : మూడో టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. జైస్వాల్ సెంచ‌రీ.. 322 ప‌రుగుల ఆధిక్యం

రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది.

IND vs ENG 3rd Test : మూడో టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. జైస్వాల్ సెంచ‌రీ.. 322 ప‌రుగుల ఆధిక్యం

IND vs ENG 3rd Test

IND vs ENG : రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగుల‌కే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండు వికెట్లు న‌ష్టపోయి 196 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (65), కుల్దీప్ యాద‌వ్ (3) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 322 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

జైస్వాల్ విధ్వంసం..

126 ప‌రుగుల‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. 19 ప‌రుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ జ‌ట్టు స్కోరు 30 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ద‌శ‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన గిల్‌తో క‌లిసి య‌శ‌స్వి జైస్వాల్ (104 రిటైర్ హార్ట్; 133బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన జైస్వాల్ క్ర‌మంగా వేగం పెంచాడు. మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెడ్డ బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు.

Badminton Asia Team Championships : చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు

ఓవైపు జైస్వాల్ వేగంగా ఆడుతుంటే మ‌రో వైపు గిల్ క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. టీ బ్రేక్ అనంత‌రం జైస్వాల్, గిల్ జోడి వేగం పెంచింది. 79 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన జైస్వాల్ 122 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడంటే అత‌డు ఎంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవ‌చ్చు. సెంచ‌రీ అనంత‌రం వెన్ను నొప్పితో అత‌డు రిటైర్‌హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. మ‌రో వైపు గిల్ 98 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. య‌శ‌స్వి గ్రౌండ్‌ను వీడ‌డంతో వ‌చ్చిన‌ ర‌జ‌త్ పాటిదార్ డ‌కౌట్ కాగా.. కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి గిల్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా మూడో రోజు ఆట‌ను ముగించాడు.

112 ప‌రుగులు 8 వికెట్లు..

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మ‌రో 112 ప‌రుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికే జోరూట్ (18)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే కుల్దీప్ యాద‌వ్ విధ్వంస‌క‌ర ఆట‌గాడు జానీ బెయిర్ స్టో (0) డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. మ‌రోవైపు బెన్‌డ‌కెట్ నిల‌క‌డ‌గా ఆడుతూ 150 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. అనంత‌రం అత‌డిని కూడా కుల్దీప్ యాద‌వే ఔట్ చేశాడు.

ఆ త‌రువాత బెన్‌స్టోక్స్ (41), బెన్ ఫోక్స్ (13) లు ప‌ట్టుద‌ల‌గా నిల‌వ‌డంతో ఓ ద‌శ‌లో ఇంగ్లాండ్ 290/ 5తో ప‌టిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ విజృంభించ‌డంతో అనూహ్యంగా ఇంగ్లాండ్ మ‌రో 29 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు, కుల్దీప్ యాద‌వ్, ర‌వీంద్ర జ‌డేజాలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. బుమ్రా, అశ్విన్‌లు ఒక్కొ వికెట్ సాధించాడు. భార‌త జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

Jonny Bairstow : ఏంట‌య్యా ఇదీ.. భార‌త్ అంటే అంత భ‌య‌ప‌డిపోతున్నావ్‌ ఎందుకు? ఇలా అయితే కెరీర్ ఖ‌తం