బుమ్రా వచ్చాడంటే జో రూట్ పెవిలియన్ బాట పట్టాల్సిందే.. ఎందుకంత భయం!

బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు.

బుమ్రా వచ్చాడంటే జో రూట్ పెవిలియన్ బాట పట్టాల్సిందే.. ఎందుకంత భయం!

Joe Root

Joe Root – Bumrah : రాజ్‌కోట్‌ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌట్ అయింది. మూడోరోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (18) ఔట్ అయ్యాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు త‌గిలింది. రెండో స్లిప్‌లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ చ‌క్క‌టి క్యాచ్ అందుకున్నాడు.

Also Read : IND vs ENG 3rd Test : మూడో టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. జైస్వాల్ సెంచ‌రీ.. 322 ప‌రుగుల ఆధిక్యం

ఇదిలాఉంటే బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు. ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో ఐదు ఇన్నింగ్స్ లలో మూడు సార్లు బుమ్రా బౌలింగ్ లోనే జోరూట్ పెవిలియన్ బాటపట్టడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఓ నెటిజన్.. జో రూట్ ఇంగ్లండ్ లోని తన ఇంటి నుంచి మారబోతున్నాడు.. అతను బుమ్రా జేబులో శాశ్వత నివాసాన్ని ఏర్పరుచుకున్నట్లు ఉందని పేర్కొన్నాడు. మరికొందరు నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపించారు.