RCB : పాటిదార్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ విజయం.. గ్రాండ్ గా ఫైనల్స్ లోకి ఎంట్రీ..
ఫైనల్‌కు చేరుకోవడం ఆ జట్టుకు వరుసగా ఇది రెండోసారి. (RCB)
- Saketh U
- Published on- May 26, 2026 / 11:57 PM IST
RCB
RCB : ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాటిదార్.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో కేవలం 162 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ను ఆర్సీబీ జట్టు ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్స్ లోకి ఎంటర్ అయింది. ఫైనల్‌కు చేరుకోవడం ఆ జట్టుకు వరుసగా ఇది రెండోసారి. ఆర్సీబీ జట్టు గత సంవత్సరం టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
