RCB Sold : ఆర్సీబీని అమ్మేశారు.. భారీ ధరకు కొనుగోలు చేసిన బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్.. ఎంత చెల్లించారంటే?

RCB Sold : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అతిపెద్ద డీల్ జరిగింది. ర్సీబీ ప్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌‌‌‌స్టోన్‌‌‌‌లతో కూడిన కన్సార్టియం సొంతం చేసుకుంది.

RCB Sold

  • ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయం ప్రక్రియ పూర్తి
  • భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్
  • అప్పుడు రూ.500 కోట్లు.. ఇప్పుడు భారీ ధరకు విక్రయం

RCB Sold : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అతిపెద్ద డీల్ జరిగింది. తద్వారా ఐపీఎల్ బ్రాండ్ విలువ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. మోస్ట్ పాపులర్ టీమ్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్రయం ప్రక్రియ పూర్తయింది. ఆర్సీబీ ప్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌‌‌‌స్టోన్‌‌‌‌లతో కూడిన కన్సార్టియం సొంతం చేసుకుంది.

Also Read : SRH : స‌న్‌రైజ‌ర్స్‌కు శుభ‌వార్త‌.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు.. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ సారథ్యంలోనే ఎస్ఆర్‌హెచ్!

ఆర్సీబీని తాము కొనుగోలు చేసినట్లు ఆధిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా, టైమ్స్ గ్రూప్ చైర్మన్ సత్యన్ గజ్వానీ ద్రువీకరించారు. రూ.16,706 కోట్లకు ఆర్సీబీ ప్రాంచైజీని బిర్లా గ్రూప్ సారథ్యంలోని కన్సార్షియం సొంతం చేసుకుంది. ఆర్సీబీ పురుషులతో పాటు మహిళల జట్టును కూడా కలిపే ఈ నాలుగు సంస్థల కన్సార్షియం సొంతం చేసుకుంది.

2008లో ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ రూ.500 కోట్లు. అప్పట్లో లీగ్‌లో అత్యధిక ధర పలికిన రెండో ఫ్రాంచైజీ ఆర్సీబీనే. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అప్పట్లో ఆర్సీబీ జట్టును కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన దేశం విడిచిపోవటం.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మాల్యా భాగస్వామిగా ఉన్న యూఎస్ఎల్ సంస్థే ప్రాంచైజీని నడిపించింది. గతేడాది (ఐపీల్ 2025) టోర్నీ ఛాంపియన్ గా ఆర్సీబీ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆధిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ – బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిపి రూ. 16,706 కోట్లకు కొనుగోలు చేశాయి.

మరోవైపు.. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)‌ ఫ్రాంచైజీని సైతం విక్రయించారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. సోమనితోపాటు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన రాబ్ వాల్టన్, పోర్ట్ మోటార్ కంపెనీ యాజమాని హాంప్ కుటుంబం కన్షార్షియంలో సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ప్రారంభంలో అత్యల్పంగా రూ.300 కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ భారీ స్థాయిలో ధరను దక్కించుకోవటం విశేషం. అయితే, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల విక్రయ ఒప్పందాలపై బీసీసీఐతోపాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.