Rinku Singh: నేను ఇండియన్ జెర్సీని ధరించడం చూసి.. నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషిస్తారు.. ఆ రోజు వారికి అంకితం అవుతుంది
నేను బలమైన వ్యక్తిని.. కానీ, కొంచెం భావోద్వేగంతో కూడా ఉన్నాను. నేను మొదటిసారిగా ఇండియా జెర్సీని ధరించినప్పుడు కొంత కన్నీళ్లు వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను.
- Harishth Thanniru
- Published On : July 16, 2023 / 02:00 PM IST
Rinku Singh
India Cricketr Rinku Singh: రింకు సింగ్.. క్రికెట్ పరిచయమున్నవారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2023 ఐపీఎల్ (IPL 2023) సీజన్‍లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు తరపున ఆడిన రికు సింగ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టీ20 (T20) ఫార్మాట్‌లో బిగ్ హిట్టర్‌గా పేరుగడించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకుకు టీమిండియా జట్టులో అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చెనై వేదికగా ఆసియా క్రీడలు జరుగుతాయి. ఈ క్రీడల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడే జట్టులో రింకు సింగ్ కు చోటు దక్కింది. జట్టులో చోటు దక్కడంపై రింకు సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. భారత జట్టు జెర్సీ ధరించడం తన చిరకాల వాంఛ అని త్వరలోనే తీరనుండటం ఆనందంగా ఉందని అన్నారు.
Rinku Singh: రింకూ సింగ్ సిక్స్ ప్యాక్.. శుభ్‌మన్ గిల్ సోదరి కామెంట్
నేను బలమైన వ్యక్తిని.. కానీ, కొంచెం భావోద్వేగంతో కూడా ఉన్నాను. నేను మొదటిసారిగా ఇండియా జెర్సీని ధరించినప్పుడు కొంత కన్నీళ్లు వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం అని రింకు ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ప్రతిఒక్కరూ భారతదేశం కోసం ఆడాలని కలలుకంటారు. అయితే, ఆ జెర్సీని ధరించడం ఆనందంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత భారంమీపై పడుతుందని రింకు సింగ్ చెప్పారు.
Rinku Singh: వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టడంపై రింకు సింగ్ ఏమన్నాడంటే..?
నేను ఇండియన్ జెర్సీని ధరించడం చూసి నా కంటే నా కుటుంబం, నా తల్లిదండ్రులు ఎక్కువ సంతోషిస్తారని నాకు తెలుసు. వారు దీనికోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారు నా కష్టాన్ని చూశారు. నాకు సహాయం చేశారు. నాతోనే ఉన్నారు అని అన్నారు. నేను జెర్సీని ధరించిన రోజు వారికి అంకితం అవుతుందని రింకు సింగ్ భావోద్వేగంతో చెప్పారు.
