Rishabh Pant : ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. బరిలోకి దిగనున్న రిషభ్ పంత్!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) ఆరంభ సీజన్ ఆగస్టు 17 శనివారం నుంచి ఆరంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Published On : August 16, 2024 / 09:57 AM IST
Rishabh Pant
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) ఆరంభ సీజన్ ఆగస్టు 17 శనివారం నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్ కావడంతో భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ సైతం బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చిన పంత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. డీపీఎల్‌లోని అన్ని మ్యాచులను పంత్ ఆడే అవకాశం లేదు. అయితే.. కొన్ని మ్యాచులు మాత్రమే ఆడనున్నట్లుగా తెలుస్తోంది.
దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పంత్ ఆడనున్నాడు. గాయం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. టెస్టుల్లోనూ అతడు చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో అతడు రాణించాల్సిన అవసరం ఉంది.
Dinesh Karthik : ధోని పై అక్కసుతోనే దినేశ్ కార్తీక్ ఇలా చేశాడా..?
‘డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు రిషబ్ పంత్ ఒప్పుకున్నాడు. ఢిల్లీ కుర్రాళ్లకు ఇది నిజంగా గొప్ప వేదిక. ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ ముందుకు రావడం అభినందనీయం. అతడి కెరీర్ ముందుకు సాగడంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
