Rajat Patidar : బీసీసీఐ బిగ్ డెషిషన్.. ఆసియా కప్ నుంచి రజత్ పాటిదార్ ఔట్.. అసలేం జరిగిందంటే..?

Rajat Patidar : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌ 2026 ప్రారంభానికి ముందే ఇండియా-ఏ జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్‌ రజత్ పాటిదార్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

Rajat Patidar

Rajat Patidar : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌ 2026 ప్రారంభానికి ముందే ఇండియా-ఏ జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్‌ రజత్ పాటిదార్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ఉన్న గాయాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని 50 ఓవర్ల ఫార్మాట్‌లో తనను ఎంపిక చేయవద్దని బీసీసీఐకి తెలిపాడు. దీంతో అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ ఆయుష్ బదోనీకి సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

Also Read : Arjun Rajput : పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన 14 ఏళ్ల సంచలనం.. ఎవరీ అర్జున్ రాజ్‌పుత్..? పేదరికాన్ని ఓడించిన క్రికెటర్

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఇండియా-ఏ జట్టు గ్రూప్‌-బిలో పాకిస్థాన్-ఏ, నేపాల్‌, యూఏఈ జట్లతో తలపడనుంది. నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 22న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏతో కీలక పోరు జరగనుంది. నవంబర్ 24న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీ కోసం జట్టు వైస్ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

రజత్ పాటిదార్ ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్‌కు తనను పరిగణనలోకి తీసుకోవద్దని బీసీసీఐకి సమాచారం అందించాడు. దీంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టు నుంచి అతడిని బీసీసీఐ తప్పించింది. మరోవైపు జట్టులో నాయకత్వ బాధ్యతల్లోనూ మార్పు చోటు చేసుకుంది. వైస్ కెప్టెన్ బాధ్యతలను రింకూ సింగ్‌కు అప్పగించారు. కెప్టెన్‌గా తిలక్ వర్మ కొనసాగనున్నాడు.

పాటిదార్ స్థానంలో ఢిల్లీ యువ ఆల్‌రౌండర్‌ ఆయుష్ బదోనీకి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో బదోనీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో గుజరాత్‌, జార్ఖండ్‌ జట్లపై వరుసగా ద్విశతకాలు సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి ఇండియా-ఏ జట్టులో చోటు దక్కింది.

ఇండియా-ఏ జట్టు ఇదే..
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), సూర్యాన్ష్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్, ఆయుష్ బదోనీ.