Riyan Parag To Be Named Rajasthan Royals Captain Report
Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 మెగావేలం కన్నా ముందు ఆ జట్టును వీడిన సంగతి తెలిసిందే. అతడిని ట్రేడింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఆర్ఆర్‌కు రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ దూరం కావడంతో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడుతారో అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
తమ జట్టు కెప్టెన్‌గా అస్సాం క్రికెటర్‌ను రాజస్థాన్ రాయల్స్ ఎంపిక చేసిందట. అతడు మరెవరో కాదు.. గత కొన్నాళ్లుగా ఆ జట్టుతో కీలక ఆటగాడిగా ఉంటూ వస్తున్న 24 ఏళ్ల రియాన్ పరాగే అని క్రిక్ ఇన్ఫో తెలిపింది. కెప్టెన్సీ కోసం ఆ జట్టు కోచ్ సంగక్కర పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశారని, వారిలో పరాగ్ అతడిని మెప్పించాడని పేర్కొంది. అయితే.. సంగక్కర ఇంటర్వ్యూ చేసిన మిగిలిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం..
రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 26.1 సగటుతో 1566 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో గాయంతో సంజూ శాంసన్ దూరమైన సందర్భంలో ఎనిమిది మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్ ఆర్ఆర్‌కు తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే.. ఇందులో కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే రాజస్థాన్ గెలుపొందింది. కెప్టెన్‌గా అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 95 పరుగులతో తన అత్యధిక స్కోరును సాధించాడు.
ట్రేడింగ్‌లో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, స్టార్ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను కాదని రియాన్ పరాగ్‌కు ఆర్ఆర్ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆ జట్టు దీర్ఘకాలిక దృష్టి ఉన్నట్లుగా అర్థమవుతోంది.
ఐపీఎల్ అరంగ్రేట సీజన్ (2008) లో షేర్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. మరోసారి ఆ జట్టు కప్పును ముద్దాడలేదు. మరి రియాన్ పరాగ్ అయిన ఆ లోటును పూడుస్తాడో లేదో చూడాలి.