Rohit Sharma : రోహిత్ ముంబైని నడిపిస్తాడు.. అయితే.. : మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : April 5, 2024 / 02:32 PM IST
Rohit Sharma
Rohit Sharma – Mumbai Indians : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఓటములను చవిచూసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ముంబై దారుణ ప్రదర్శనలకు కారణం కెప్టెన్సీ మార్పేనని చాలా మంది అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించిన రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించి హార్ధిక్ పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జట్టులో ఎలాంటి ఘర్షణ లేదని, ఈ సీజన్‌లో హార్దిక్ కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇష్టపడతాడని అభిప్రాయపడ్డాడు. ‘మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడడం చూశాం కదా. ఆ సమయంలో ప్రపంచకప్‌ను సైతం గెలిచాం కదా. ఇప్పుడు కొత్త కెప్టెన్ హార్దిక్ సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడడం పై ఎన్నో కథనాలు వస్తున్నాయి. అయితే.. స్వేచ్ఛగా ఆడేందుకు రోహిత్ ఇష్టపడతాడు.’ అని శ్రీశాంత్ అన్నాడు.
Michael Clarke : హార్దిక్ పై ఎడతెగని హేళనను ఆపేందుకు ఏకైక మార్గం అదే : మైకేల్ క్లార్క్
కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో హిట్‌మ్యాన్ ఆరెంజ్ క్యాప్ రేసులోనూ నిలుస్తాడని శ్రీశాంత్ జోస్యం చెప్పాడు. ఇది రోహిత్‌కు చాలా మంచి సీజన్ అవుతుందని తెలిపాడు. గతంలో ముంబైని రోహిత్ ముందు ఉండి నడిపించాడు. ఇప్పుడు వెనుక నుంచి నడిపించబోతున్నాడని అన్నాడు.
అలాగే.. మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. రోహిత్ ఏ ప్రాంచైజీకి ఆడినా మార్పు ఉండదన్నాడు. వ్యక్తిగతంగా హిట్‌మ్యాన్‌కు క్లిష్టసమయమే అయినప్పటికీ పరిస్థితులను అధిగమిస్తాడనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఈ సీజన్‌లో రోహిత్ భారీగా పరుగులు చేయబోతున్నాడని శ్రీశాంత్ తెలిపాడు.
IPL 2024: క్రికెట్ పిచ్చికి నిదర్శనం.. దిండు, దుప్పటితో దిగేశారుగా..
