Ashwin : రోహిత్, కోహ్లీల‌ను ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేరు.. అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ‌ట‌..

రో-కో భ‌విష్య‌త్తుపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ashwin) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Rohit Sharma And Virat Kohli Cannot Be Touched says Ashwin

Ashwin : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టీ20లు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన భార‌త సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వీరిద్ద‌రి భ‌విష్య‌త్తుపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. రో-కోల‌ను జట్టు నుంచి తొల‌గించ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం అని చెప్పుకొచ్చాడు. వారిని బ‌ల‌వంతంగా పంపిస్తే ఫ్యాన్స్ చూస్తూ ఊరుకోర‌ని హెచ్చ‌రించాడు. రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ పై ఇటీవల ఊహాగానాలు వ‌చ్చిన త‌రుణంలో అశ్విన్ వ్యాఖ్య‌లకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

ఒకవేళ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఆడాల‌ని అనుకుంటే వారిని జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డం ఎంతో క‌ష్టం. ఇందుకు రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. మొద‌టి వారి అద్భుత‌మైన ప్ర‌తిభ‌. రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో 11వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. కాబ‌ట్టి ఇలాంటి ఆట‌గాడిని ప‌క్క‌న బెట్ట‌డం క‌ష్టం. ఇక కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న ఆట‌తో తానేంటో నిరూపించుకున్నాడు. అని అశ్విన్ అన్నాడు.

Rohit Sharma-Virat Kohli : రోహిత్, కోహ్లీ.. రెండు నెల‌లు క్రికెట్‌కు దూరం..

రెండో కార‌ణం ఏంటి అంటే.. వారికి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌. వీరిద్ద‌రు మ్యాచ్‌లు ఆడుతున్నారు అంటే.. వారిని చూసేందుకు ల‌క్ష‌లాదిగా ప్రేక్ష‌కులు మైదానానికి త‌ర‌లివ‌స్తారు. అలాంటి వారిని జ‌ట్టు నుంచి త‌ప్పిస్తే.. పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌స్తుంది. వారిని త‌ప్పించాల‌ని చూస్తే ప్ర‌జ‌లు ఊరుకుంటారా? ఒక వేళ వారిని తొల‌గిస్తే స్టేడియం పైక‌ప్పు లేచిపోవ‌డం ఖాయం అని త‌న‌దైన శైలిలో అశ్విన్ చెప్పుకొచ్చాడు.

అయితే.. బౌల‌ర్ల ప‌రిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంద‌న్నాడు. ష‌మీ లేదా సిరాజ్ లేదా భువనేశ్వ‌ర్ కుమార్ వంటి బౌల‌ర్లు జ‌ట్టులో లేక‌పోతే కొంత మంది మాత్ర‌మే ప్ర‌శ్నిస్తారు. స్టార్ బ్యాట‌ర్ల కు జ‌రిగినంత స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గ‌ద‌న్నాడు. ఒక‌వేళ బౌల‌ర్ల కోసం కూడా అదే స్థాయిలో చ‌ర్చిస్తే.. అప్పుడు వారిని జ‌ట్టు నుంచి తొల‌గించ‌డం క‌ష్టం అవుతుంది అని అశ్వాన్ తెలిపాడు.