Rohit Beats Chahal : చాహల్‌ను కొట్టిన రోహిత్.. పక్కనే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే..?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అప్పుడప్పుడు సహనం కోల్పోతుంటాడు. మైదానంలో ఫీల్డర్లు ఏదైన తప్పులు చేస్తే వారిపై హిట్‌మ్యాన్ అరిచే సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2023 / 03:59 PM IST
Rohit Beats Chahal
Rohit-Chahal : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అప్పుడప్పుడు సహనం కోల్పోతుంటాడు. మైదానంలో ఫీల్డర్లు ఏదైన తప్పులు చేస్తే వారిపై హిట్‌మ్యాన్ అరిచే సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆటలో ఉండే భావోద్వేగం కారణంగానే ఇలా జరుగుతుందనేది అందరికి తెలిసిందే. అయితే.. మైదానం బయట రోహిత్ చాలా సరదాగా ఉంటాడు విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
ఇదిలా ఉంటే టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ను రోహిత్ శర్మ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాహల్‌ను రోహిత్ కొడుతున్నప్పుడు పక్కనే కోహ్లి (Kohli) కూడా ఉండడం గమనార్హం.
David Warner : వార్నర్ మామా.. ప్రపంచ రికార్డు.. ఆసీస్ జోరుకు వర్షం బ్రేకులు
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1 తో సమమైంది. ఈ మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా డగౌట్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. డగౌట్‌లో కూర్చుని ఉన్న చాహల్‌ను రోహిత్ శర్మ సరదాగా కొట్టాడు.
ఓ నాలుగైదు దెబ్బలు వేశాడు. చాహల్ పక్కనే విరాట్ కోహ్లి, జయదేవ్ ఉన్కదత్ కూడా కూర్చోని ఉన్నారు. చాహల్‌ను రోహిత్ కొట్టడం చూసి వారు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
విండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో చాహల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. విరాట్, రోహిత్‌లు రెండో వన్డేకు విశ్రాంతి తీసుకోవడంతో సంజు శాంసన్, అక్షర్ పటేల్‌లకు అవకాశం లభించింది. అయితే.. వారు ఘోరంగా విఫలం అయ్యారు. కీలకమైన మూడో వన్డే ట్రినిడాడ్ వేదికగా మంగళవారం జరగనుంది.
Rohit Sharma and Chahal bond is the best and most funniest in the team. ?pic.twitter.com/fuAQLDazgl
— Vishal. (@SPORTYVISHAL) July 30, 2023
