ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. వన్డేల్లో 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో
ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య పేరున ఉంది. 1997లో సనత్ జయసూర్య ఒకే ఏడాదిలో 2వేల 387 పరుగులు సాధించాడు. 22 ఏళ్లుగా ఆ రికార్డ్ ను ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. ఇప్పుడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ ను బద్దలుకొట్టాడు.
కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న డిసైడర్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రికార్డ్ ను అధిగమించాడు. 2019 కేలండర్ ఇయర్ లో రోహిత్ శర్మ.. 2వేల 379 పరుగులు చేశాడు. విండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో మరో 9 పరుగులు జోడించి రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వన్డేల్లో పరుగుల వరద పారించాడు. డబుల్ సెంచరీలతో చెలరేగాడు.
316 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్…5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 122 పరుగుల జట్టు స్కోర్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. హాఫ్ సెంచరీతో దూకుడు మీదున్న రోహిత్ శర్మ.. 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యాడు. రోహిత్ ను హోల్డర్ పెవిలియన్ పంపాడు.
Milestone ?
Rohit Sharma surpasses Sanath Jayasuriya as the leading run scorer in a calendar year across formats. pic.twitter.com/E4Cr7n6ret
— BCCI (@BCCI) December 22, 2019