Rohit Sharma : సెంచరీల మోత.. సచిన్ రికార్డు బ్రేక్.. తుడిచిపెట్టుకుపోయిన కపిల్ దేవ్ 40 సంవత్సరాల రికార్డు
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 11, 2023 / 08:23 PM IST
Rohit Sharma
Rohit Sharma World Record : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 63 బంతుల్లో సెంచరీ చేయడంతో రోహిత్ ఈ ఘనతను చేరుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది 7వ శతకం. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ వన్డే ప్రపంచకప్‌లో 6 సెంచరీలు చేశాడు.
ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ (భారత్) – 7
సచిన్ టెండూల్కర్ (భారత్) – 6
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 5
కుమార సంగక్కర (శ్రీలంక) – 5
కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..
భారత్ తరుపున వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ కేవలం 63 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ పేరిట ఉండేది. దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే 1983 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వే పై కపిల్ దేవ్ 72 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా శతకంతో రోహిత్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.
