Rohit Sharma Daughter : నాన్న రూమ్‌లో ఉన్నాడు.. ఒక నెలలోమళ్లీ నవ్వుతాడు..! రోహిత్ కూతురు సమైరా వ్యాఖ్యలు వైరల్
Rohit Sharma Daughter Samira : ఫైనల్ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ కనిపించలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గారాల పట్టీ, కూతురు అయిన సమైరా విలేకరుల కంట పడింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 23, 2023 / 04:35 PM IST
Rohit Sharma Daughter Samira comments
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమ్ఇండియా ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోవడంతో కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశ చెందాడు. ఈ టోర్నీ ఆసాంతం ఓ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించాడు. ఓపెనర్ అయిన హిట్‌మ్యాన్ ఆరంభంలోనే వేగంగా పరుగులు రాబడుతూ ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీశాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ 31 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అయితే.. మిగిలిన ఆటగాళ్లు రాణించకపోవడంతో టీమ్ఇండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఈ టోర్నీలో రోహిత్ 597 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అలసిపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ కనిపించలేదు. అయితే… రోహిత్ శర్మ గారాల పట్టీ, కూతురు అయిన సమైరా విలేకరుల కంట పడింది. తన తల్లి రితికా సజ్దేతో కలిసి సమైరాతో కలిసి వెలుతుండగా విలేకరులు మీ నాన్న ఎక్కడ ఉన్నారు అని సమైరాను అడిగారు.
cricket Fan : నువ్వు టీమ్ఇండియా కోచ్‌గా రా బాసూ..! నెటిజన్లను ఆకట్టుకున్న ఫ్యాన్.. వీడియో
‘అతను రూమ్‌లో ఉన్నాడు. అతడు చాలా సానుకూల థృక్పధంతో ఉన్నాడు. ఒక నెలలో అతడు మళ్లీ నవ్వుతాడు.’ అంటూ సమైరా చెప్పుకొచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని రోహిత్ ఇంకా జీర్ణించుకోలేదు. త్వరలోనే అతడు ఆ బాధ నుంచి బయటకు వచ్చి క్రికెట్‌ను ఆడుతాడని సమైరా తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ భాయ్ నువ్వు అద్భుతమైన కెప్టెన్‌వి. ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రన ఏం కాదు. మేమంతా నీ వెంటనే ఉన్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
