Rohit Sharma : బర్త్‌డే బాయ్నే గిఫ్ట్ అడిగిన రోహిత్ శర్మ.. పాపం ఇషాన్ కిషన్ ఇచ్చేనా..!
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మంగళవారం (జూలై 18) 25వ పడిలో అడుగుపెట్టాడు. బర్త్ డే రోజు ఎవరు అయినా సరే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తుండడాన్ని సాధారణంగా చూస్తుంటాం. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇషాన్ కిషన్‌నే ఓ గిఫ్ట్ అడిగాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 19, 2023 / 03:25 PM IST
Rohit Sharma Demands Gift From Ishan Kishan
Rohit Sharma-Ishan Kishan : టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మంగళవారం (జూలై 18) 25వ పడిలో అడుగుపెట్టాడు. అతడి పుట్టిన రోజు సందర్భంగా భారత ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే రోజు ఎవరు అయినా సరే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తుండడాన్ని సాధారణంగా చూస్తుంటాం. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharm) మాత్రం ఇషాన్ కిషన్‌నే ఓ గిఫ్ట్ అడిగాడు. రోహిత్ అడిగిన దాన్ని ఇషాన్ అందిస్తాడో లేదో మరో నాలుగైదు రోజుల్లో తెలిసిపోతుంది. అయితే ఇందుకు ఇషాన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది.
టీమ్ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో అతిథ్య విండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 20 బంతులు ఆడిన ఇషాన్ పరుగు తీయగానే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇది అతడికి అరంగ్రేటం మ్యాచ్ కావడంతో పరుగుల ఖాతా తెరిచే వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ను చేయవద్దని బావించినట్లు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు.
రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సిద్దం అవుతున్నారు. ఇషాన్ బర్త్‌డే కావడంతో.. ఆ రోజు అతడు ఏం చేశాడనేది బీసీసీఐ ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది. ప్రాక్టీస్ చేయడం నుంచి కేక్ కటింగ్ వరకు ఆ వీడియోలో చూపించింది. ఇషాన్‌కు ఏం బహుమతి ఇస్తున్నారని రోహిత్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు.
ఏం గిఫ్ట్ కావాలి..? అతడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఇషాన్ నువ్వే మాకు బహుమతి ఇవ్వు. రెండో టెస్టులో శతకం బాది అదే గిఫ్ట్‌గా ఇవ్వు అని రోహిత్ అన్నాడు. మరీ రోహిత్ అడిగిన దాన్ని ఇషాన్ కిషన్ అందిస్తాడో లేదో చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లాడు రోహిత్.. ఇలా నువ్వు గిఫ్ట్ లు అడిగితే దడుచుకుంటాడు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
