Rohit Sharma drown Mitchell Starc chants with typical Hitman response
Rohit Sharma talk : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నాడు. అతడి నాయకత్వంలో టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2024ను అందుకుంది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన అనంతరం హిట్‌మ్యాన్ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ అమెరికా పర్యటనలో ఉన్నాడు.
అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మ పాల్గొని మాట్లాడుతుండగా అభిమానులు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరుతో నినాదాలు చేశారు. దీనిపై రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Shubman Gill : నక్కతోక తొక్కిన శుభ్‌మన్ గిల్.. ఒక్క సిరీస్‌తోనే..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న హిట్‌మ్యాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. అతడిని ఉత్సాహపరిచేందుకు అభిమానులు మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్ అని నినాదాలు చేశారు. దీంతో రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. కుర్రాళ్లు కాస్త ప్రశాంతంగా ఉండండి అంటూ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో సూపర్ దశలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ వేసిన ఓ ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో విధ్వంసాన్ని గుర్తు చేస్తూ అభిమానులు స్టార్క్, స్టార్క్ అని నినాదాలు చేస్తూ రోహిత్ ను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.
Rohit Sharma : వన్డేల్లో, టెస్టుల్లో రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
Crowd chanting ‘Mitchell Starc’.
– Rohit Sharma says ‘calm down, guys’. 😂 pic.twitter.com/DRDt7nnwfx
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024