Rohit Sharma : రిటైర్‌మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్ శర్మ.. వాళ్లకు నాకు చెప్పింది అదే..
తన రిటైర్‌మెంట్ పై వస్తున్న వార్తలపై రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 20, 2026 / 04:13 PM IST
Rohit Sharma Ends Retirement Speculations In Explosive Interview
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 138 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్‌మ్యాన్.. కుదురుకున్నాక గేరు మార్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికి కూడా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నాడు అనే వార్తలను హిట్‌మ్యాన్ ఖండించాడు.
బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. మైదానంలో వెళ్లి బ్యాటింగ్ చేయడమే నా పని. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి నాకు అప్పగించిన బాధ్యత ఇదే. అదే నేను కొనసాగిస్తాను. నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచే ఇలాంటి వార్తలను ఎన్నో వింటూనే ఉన్నాను. ఇలాంటి రూమర్లు నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉంది అన్నదే ముఖ్యం. జట్టు విజయం కోసం ఎలా సహరిస్తున్నాను అనేదే కీలకం అని రోహిత్ శర్మ తెలిపాడు.
Joe Root : నవ్వు తోపురా అయ్యా.. సిరీస్ మొత్తంలో ఒక్కసారి ఔట్ కాలే.. మెంటల్ ఎక్కించేశాడు..
అప్పుడప్పుడు ఇలాంటి వదంతులు వస్తుంటేనే కదా .. మనకూ కాస్త సరదాగా ఉంటుంది. నా పని నాదే. బయట వాళ్ల పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యంలో పొందాలని అనుకుంటారు అని రోహిత్ శర్మ అన్నాడు.
ఇక కోహ్లీతో కలిసి 400 మ్యాచ్‌లు ఆడడంపై మాట్లాడుతూ.. అతడితో కలిసి ఆడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నాడు. కెరీర్ తొలి నాళ్ల నుంచి తాము కలిసి ఆడుతున్నామని, ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలను నెలకొల్పామని అన్నారు. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని, ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటామని రోహిత్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడడమే తన లక్ష్యం అని ఇప్పటికే పలు మార్లు రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.
