Rohit Sharma : అఫ్గాన్‌తో తొలి వ‌న్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శ‌ర్మ క‌న్ను..

అఫ్గానిస్థాన్‌తో తొలి వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ‌ను (Rohit Sharma) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Rohit Sharma just 6 runs away from entering the 16000 run club as an opener

  • శ‌నివారం నుంచి అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌
  • తొలి వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు
  • ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 6 ప‌రుగులు చేస్తే..

Rohit Sharma : భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు ధ‌ర్మ‌శాల ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఫిట్‌నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణ‌త సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ తొలి వ‌న్డేకు అందుబాటులోకి వ‌చ్చాడు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 6 ప‌రుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఓపెన‌ర్‌గా 16 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే 126 ప‌రుగులు సాధిస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఓపెన‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగ‌మిస్తాడు. ఓపెన‌ర్‌గా సెహ్వాగ్ 16119 ప‌రుగులు చేయ‌గా హిట్‌మ్యాన్ 15994 ప‌రుగులు సాధించాడు.

*PV Sindhu : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఓపెన‌ర్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* సనత్ జయసూర్య (శ్రీలంక) – 19298 పరుగులు
* క్రిస్ గేల్ (వెస్ట్ ఇండీస్) – 18867 పరుగులు
* డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 18744 పరుగులు
* గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) – 16950 పరుగులు
* డెస్మండ్ హేన్స్ (వెస్ట్ ఇండీస్) – 16120 పరుగులు
* వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం) – 16119 పరుగులు
* రోహిత్ శర్మ (భారతదేశం) – 15994 ప‌రుగులు

కాగా.. సెహ్వాగ్ రికార్డును అధిగ‌మించేందుకు రోహిత్ శర్మ‌కు అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు అవ‌కాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో 126 ప‌రుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగ‌మిస్తాడు.

*FIFA World Cup 2026 : ఏమ‌య్యా మ్యాచ్ రిఫ‌రీ ఎల్లో కార్డు మ‌రిచిపోయావా ఏంది? మూడు రెడ్ కార్డులే.. మీమ్స్ వైర‌ల్‌

భార‌త్, అఫ్గాన్ వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వ‌న్డే – జూన్ 13న (ధ‌ర్మ‌శాల‌)
* రెండో వ‌న్డే – జూన్ 17న (ల‌క్నో)
* మూడో వ‌న్డే – జూన్ 20న (చెన్నై)