PV Sindhu : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అదరగొడుతోంది.
PV Sindhu enter Into Australian Open Semis
- ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు
- క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూ పై విజయం
PV Sindhu : తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అదరగొడుతోంది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూపై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-6, 21-9 తేడాతో గెలుపొందింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది.
TOTAL DOMINATION BY PV SINDHU 🔥🔥🔥
She defeated Chen Su 🇹🇼 21-6, 21-9 in the Quaterfinals of Australian Open (Super 500) 💥
WELL DONE CHAMP! 🇮🇳🙌pic.twitter.com/lveUzUnaxK
— The Khel India (@TheKhelIndia) June 12, 2026
కాగా.. సెమీఫైనల్లో సింధుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. జపాన్‌కు చెందిన ప్రపంచ మూడవ నంబర్ ర్యాంకర్, టోర్నీ అగ్రశ్రేణి క్రీడాకారిణి యమగుచితో ఆమె తలపడనుంది. కాగా.. క్వార్టర్ ఫైనల్లో యమగుచి భారత యువ షట్లర్ తన్వి శర్మ పై 21-14, 21-14తో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
ఇక సింధు, యమగుచి మధ్య ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో సింధు, 13 మ్యాచ్‌ల్లో యమగుచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
