Rohit Sharma : ద‌టీజ్ రోహిత్ శ‌ర్మ‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ‘పుల్ షాట్’ పాఠాలు..

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్‌లో గ‌త కొన్నాళ్లుగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క ఆట‌గాడిగా ఉంటూ వ‌స్తున్నాడు.

Rohit Sharma shows Shreyas Iyer how to play Pull shot before Sri Lanka ODI

Rohit Sharma Shreyas Iyer : శ్రీలంక‌తో టీ20 సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌న్డే సిరీస్ పై ప‌డింది. ఆగ‌స్టు 2 నుంచి మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌రువాత ఆడ‌నున్న తొలి సిరీస్ ఇదే కావ‌డం గ‌మనార్హం. వ‌న్డే జ‌ట్టులోని ఆట‌గాళ్లు శ్రీలంక‌కు చేరుకున్నారు. ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లెట్టేశారు. కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్లు నెట్స్‌లో చెమ‌టోడ్చుతున్నారు. రోహిత్ సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు వ‌న్డేల్లో బ‌రిలోకి దిగ‌నుంది.

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్‌లో గ‌త కొన్నాళ్లుగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క ఆట‌గాడిగా ఉంటూ వ‌స్తున్నాడు. మిగిలిన షాట్ల‌ను ఎంతో చ‌క్క‌గా ఆడుతున్న‌ప్ప‌టికి ఒక్క పుల్ షాట్ ఆడే క్ర‌మంలో అత‌డు ప‌లు మార్లు ఔట్ అయ్యాడు. ఈ లోపాన్ని స‌రిచేసుకునేందుకు అత‌డు పుల్ షాట్‌లో ఎక్స్‌ప‌ర్డ్ అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సాయం తీసుకున్నాడు. ఇక అత‌డు అడిగిందే ఆల‌స్యం.. పుల్ షాట్‌ను ఎలా ఆడాలో హిట్‌మ్యాన్ అత‌డికి వివ‌రంగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రోహిత్ శ‌ర్మ‌ది మంచి మ‌న‌సు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: సంజూ శాంస‌న్ ఖేల్ ఖ‌తం..! ఐపీఎల్ ఆడుకోవాల్సిందే.. టీమ్ఇండియాలో చోటు క‌ష్ట‌మే..?

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌..

తొలి వ‌న్డే – ఆగ‌స్టు 2న‌
రెండో వ‌న్డే – ఆగ‌స్టు 4న‌
మూడో వ‌న్డే – ఆగ‌స్టు 7న‌

ఈ మూడు వ‌న్డేలు కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. మ్యాచులు అన్ని కూడా భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆరంభం కానున్నాయి.

శ్రీలంక‌తో వన్డే సిరీస్‌కు భార‌త జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

ట్రెండింగ్ వార్తలు