Rohit Sharma : అయ్యో రోహిత్.. ఇలా ఔట్ అయిపోయావు.. కెప్టెనే ఇలా ఆడితే..
రాంచీ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
- Thota Vamshi Kumar
- Published On : February 26, 2024 / 02:31 PM IST
Rohit Sharma Out in Ranchi Test
Rohit Sharma Out in Ranchi Test : రాంచీ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్) లతో పాటు టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రాణించాడు. 81 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 55 పరుగులు చేశాడు. అర్ధశతకం బాది ఊపుమీద కనిపించిన రోహిత్ అనుకోని విధంగా ఔట్ అయ్యాడు. తన వికెట్‌ను అనవసరంగా పారేసుకున్నాడు. బంతి గమనాన్ని అంచనా వేయకముందే ఫ్రంట్ పుట్‌కు వచ్చి డిఫెన్స్ ఆడాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్య వచ్చేశాడు.. నాలుగు నెలల తరువాత పోటీ క్రికెట్‌లో..
ఇన్నింగ్స్ 26వ ఓవర్‌ను టామ్‌హార్డ్లీ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి రోహిత్ ఫ్రంట్ పుట్‌కు వచ్చి డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి టర్న్‌ను అతడు అంచనా వేయడంలో విఫలం కావడంతో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బాల్ నేరుగా వికెట్ కీపర్ ఫోక్స్ చేతుల్లో పడింది. అతడు క్యాచ్‌ను అందుకోవడంతో పాటు క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లను పడగొట్టేశాడు. దీంతో రోహిత్ ఔట్ అయ్యాడు.
అనవసరంగా తన వికెట్ పారేసుకున్నానని రోహిత్ నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
— Sitaraman (@Sitaraman112971) February 26, 2024
