IND vs WI : రెండో టీ20లో భార‌త్ పై విజ‌యం.. వెస్టిండీస్‌కు ఐసీసీ బిగ్ షాక్..

మూడో టీ20 మ్యాచ్‌లో ఓట‌మి బాధ‌లో ఉన్న వెస్టిండీస్‌కు (IND vs WI) ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

Rovman Powell and Sherfane Rutherford REPRIMANDED FOR BREACHING ICC CODE OF CONDUCT

IND vs WI : మూడో టీ20 మ్యాచ్‌లో ఓట‌మి బాధ‌లో ఉన్న వెస్టిండీస్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ల‌పై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంది. రాంచీ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వీరిద్ద‌రు ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రికి చెరో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది.

రాంచీ మ్యాచ్‌లో మ‌యాంక్ యాద‌వ్ బౌలింగ్‌లో పావెల్ ఔట్ అయ్యాడు. పెవిలియ‌న్‌కు వెలుతున్న క్ర‌మంలో అత‌డు త‌న బ్యాట్‌తో బంతిని కొట్టాడు. ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో ఓ బంతిని అంపైర్ వైడ్‌గా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై రూథ‌ర్‌పోర్డ్ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. వీరిద్ద‌రు ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఆన్-ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదనగోపాల్, రోహన్ పండిట్, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, ఫోర్త్ అంపైర్ వీరేందర్ శర్మ అభియోగాలు మోపారు.

World Championship of Legends 2026 : యువ‌రాజ్ సింగ్ డ‌కౌట్‌.. బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్ ఓట‌మి..

దీంతో వీరిద్ద‌రి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చారు. ఇక వీరిద్ద‌రు కూడా చేసిన త‌ప్పుల‌ను విధించిన శిక్ష‌ల‌ను అంగీక‌రించారు. దీంతో దీనిపై త‌దుప‌రి ఎలాంటి విచార‌ణ ఉండ‌దు.

అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు లేదా ఫిక్చర్‌లు, ఫిట్టింగులను దుర్వినియోగం చేయడానికి సంబంధించిన ఐసీసీ ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను పావెల్ ఉల్లంఘించినట్లు తేలింది. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో అంపైర్ నిర్ణయంపై అసమ్మతి చూపడానికి సంబంధించిన ఆర్టికల్ 2.8ను రూథర్‌ఫోర్డ్ ఉల్లంఘించినట్లు తేలింది. ఆటగాళ్ల క్రమశిక్షణా రికార్డులకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది, వీరిద్దరికీ 24 నెలల కాలంలో ఇది మొదటి ఉల్లంఘన. అని ఐసీసీ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఒక ఆటగాడు ఖాతాలో 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పొందితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. పాయింట్లను బ‌ట్టి మ్యాచ్‌ల్లో నిషేదం విధిస్తారు.

ఇదిలా ఉంటే.. రాంచీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.