Kumar Sangakkara : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర‌.. రియాన్ ప‌రాగ్ వేపింగ్ పై.. జ‌ట్టు సంస్కృతి..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర (Kumar Sangakkara) ఎట్ట‌కేల‌కు రియాన్ ప‌రాగ్ వివాదం పై స్పందించాడు.

RR head coach Kumar Sangakkara Comments on Riyan Parag vaping row

  • రియాన్ ప‌రాగ్ వివాదంపై స్పందించిన కుమార సంగ‌క్క‌ర‌
  • ఇలాంటి వివాదాలు జ‌ట్టుకు మంచివి కావు
  • బీసీసీఐ, ఫ్రాంఛైజీ చ‌ర్య‌లు తీసుకుంది
  • దీన్ని ఇంత‌టితో వ‌దిలేయండి

Kumar Sangakkara : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (మే 1) జైపూర్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర పాల్గొన్నాడు. గత మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు కెప్టెన్ వేపింగ్ (ఇ-సిగ‌రేట్‌) చేస్తూ క‌నిపించిన దృశ్యాల పై అత‌డు ఎట్ట‌కేల‌కు స్పందించాడు.

ఇలాంటి వివాదాలు జ‌ట్టుకు ఏ మాత్రం మంచివి కావ‌న్నాడు. జ‌ట్టు సంస్కృతిని కాపాడుకోవాల‌నే విష‌యాన్ని ఇది ఆట‌గాళ్ల‌కు గుర్తు చేస్తుంద‌న్నారు. అదే స‌మ‌యంలో ఫ్రాంచైజీ, బీసీసీఐ రెండు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో ఈ అంశాన్ని ఇక వ‌దిలివేయాల‌ని కోరాడు.

Sri Lanka : హోట‌ల్‌లో మ‌హిళ‌లు స్నానం చేస్తుండ‌గా.. వీడియోలు తీసిన శ్రీలంక అండ‌ర్‌-19 క్రికెట‌ర్లు.. ఇద్ద‌రి అరెస్టు..

‘ఇలాంటి వివాదాలు జట్టుకు ఏమాత్రం మంచివి కావు. ఈ రెండు సమస్యలను బీసీసీఐ, ఫ్రాంచైజీ పరిష్కరించాయని మాత్రమే నేను చెప్పగలను. జట్టు సంస్కృతిని కాపాడుకోవాలనే విషయాన్ని ఇది ఆటగాళ్లకు గుర్తు చేస్తుంది.’ అని సంగ‌క్క‌ర అన్నాడు.

జ‌రిమానా..

రియాన్ ప‌రాగ్ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మాళిలోని లెవెల్‌-1 నిబంధ‌న‌ను ఉల్లంఘించాడ‌ని ఐపీఎల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా విధిస్తూ రిఫ‌రీ అమిత్ శ‌ర్మ నిర్ణ‌యం తీసుకున్నారు. పరాగ్ త‌న త‌ప్పును అంగీక‌రించ‌డంతో విచార‌ణ అవ‌స‌రం లేకుండానే జ‌రిమానా ఖ‌రారైంది. ఆట‌గాడిపైనే కాకుండా రాజ‌స్థాన్ జ‌ట్టుపై కూడా బీసీసై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు పేర్కొంది.

Jason Holder : ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ క్యాచ్ ఔట్ పై వివాదం.. ఆ క్యాచ్ అందుకున్న జేస‌న్ హోల్డ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఇదిలా ఉంటే.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేటు +0.617గా ఉంది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. ఇక నేడు జ‌ర‌గ‌నున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరువ కావాల‌ని కోరుకుంటుంది.