IPL 2021: అంపైర్ వార్నింగ్.. దెబ్బకి బౌలింగ్ మార్చేశాడు!
క్రికెట్ లో బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్ చేసేందుకు ఈ మధ్య బౌలర్లు తరచూ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తున్నారు. ఇది తరచూ వివాదంగా మారుతుంది. రౌండ్ ఆర్మ్ బౌలింగ్ ను సీనియర్లుకూడా విసురుతుండటం విమర్శలకు తావిస్తుంది.
- kunduru Vinod
- Updated on- April 13, 2021 / 11:00 AM IST
Rr Vs Pbks Ipl 2021
RR Vs PBKS IPL 2021: క్రికెట్ లో బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్ చేసేందుకు ఈ మధ్య బౌలర్లు తరచూ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తున్నారు. ఇది తరచూ వివాదంగా మారుతుంది. రౌండ్ ఆర్మ్ బౌలింగ్ ను సీనియర్లుకూడా విసురుతుండటం విమర్శలకు తావిస్తుంది. భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్‌లు ఈ తరహా బౌలింగ్ వేసి విమర్శలపాలయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కూడా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేస్తూ బ్యాట్స్‌మన్‌ను ఇరకాటంలో పడేసేందుకు యత్నిస్తున్నారు. సోమవారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రియాన్ పరాగ్ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేశాడు.. ఈ సమయంలో గేల్ బ్యాటింగ్ లో ఉన్నారు.
10 ఓవర్ మూడో బంతిని రౌండ్ ఆర్మ్ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్ రంగంలోకి దిగాడు. వెంటనే రియాన్ పరాగ్ ను హెచ్చరించాడు. దింతో తదుపరి బంతికి యాక్షన్ మార్చి వేశాడు. ఈ బంతిని ఉద్దేశిస్తూ అంపైర్ జాగ్రత్త అంతలా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక ఇదే ఓవర్లో ఐదో బంతికి గేల్ భారీ షాట్ ఆడగా బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. లాంగాన్ వైపు భారీగా కొట్టిన ఆ షాట్‌ను స్టోక్స్ జారవిడచకుండా పట్టుకోవడంతో గేల్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో 40 పరుగుల వ్యక్తి గత స్కోరు డేంజర్ మ్యాన్ గేల్ పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
