IND VS NZ T20 Series: టీ20 సిరీస్‌కు ముందు భారత్ జట్టుకు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక ప్లేయర్ ఔట్?
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
- Harishth Thanniru
- Published On : January 26, 2023 / 04:22 PM IST
Ruturaj Gaikwad
IND VS NZ T20 Series: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ జట్టు క్లీన్‌స్వీప్ చేసిన విషయం విధితమే. వన్డే సిరీస్ జోరును టీ20 సిరీస్‌లోనూ కొనసాగించేందుకు భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో యువ ప్లేయర్లతోకూడిన భారత్ జట్టు కివీస్‌ను ఢీకొట్టనుంది. ఈ టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ 27న రాంచీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 29న లక్నోలో, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7గంటల సమయంలో ప్రారంభమవుతాయి.
Ind Vs NZ 3rd ODI : తిరుగులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ రితురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గైక్వాడ్ మణికట్టు నొప్పితో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతన్ని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి టీం మేనేజ్‌మెంట్ పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, గైక్వాడ్ గాయంపై టీమిండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రితురాజ్ గైక్వాడ్ గతంలోకూడా గాయం కారణంగా ఇబ్బంది పడ్డారు. ఈ కారణంగా గైక్వాడ్ టీమిండియాలో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మణికట్టు సమస్య కారణంగా గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తుది జట్టులో అవకాశాన్ని కోల్పోయాడు. కొవిడ్ పాజిటివ్ కారణంగా గతేడాది స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు గైక్వాడ్ దూరమయ్యాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్‌లోనూ మణికట్టు సమస్యతో గైక్వాడ్ దూరమయ్యే పరిస్థితి తలెత్తడం గమనార్హం. గైక్వాడ్ టీమిండియా తరపున తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 135 పరుగులు మాత్రమే చేశాడు. ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. 2022 అక్టోబర్‌లో టీంఇండియా తరపున చివరి మ్యాచ్ ఆడాడు.
