Ruturaj Gaikwad : ఎవ‌రి కోసం త్యాగం చేయ‌ను.. ఈ సీజ‌న్‌లో నేనే ఓపెనింగ్ చేస్తా.. నాతో పాటు ఎవ‌రంటే.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Ruturaj Gaikwad confirms he will open with Sanju Samson for CSK in IPL 2026

  • ఐపీఎల్ 2026లో సీఎస్‌కే ఓపెనింగ్ కాంబినేష‌న్ పై స్ప‌ష్ట‌త‌
  • తానే ఓపెనింగ్ చేస్తాన‌న్న రుతురాజ్ గైక్వాడ్‌
  • గ‌త సీజ‌న్‌లో వ‌న్‌డౌన్‌లో బ‌రిలోకి

Ruturaj Gaikwad : మ‌రో రెండు రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ ఆరంభానికి ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సంజూ శాంస‌న్‌తో క‌లిసి తాను ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగుతాన‌ని రుతురాజ్ స్ప‌ష్టం చేశాడు. ఈ విష‌యాన్ని ఐపీఎల్ కెప్టెన్స్ డే కార్య‌క్ర‌మం అనంత‌రం అత‌డు వెల్ల‌డించారు.

గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్ వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. డెవాన్ కాన్వే, ర‌చిన్ ర‌వీంద్ర‌, ఆయుష్ మాత్రేల కోసం 29 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ త‌న ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి ట్రేడింగ్‌లో జ‌ట్టులోకి వ‌చ్చిన శాంస‌న్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌నున్న‌ట్లు రుతురాజ్ తెలిపాడు.

IPL : జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్‌లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?

ఇక దీనిపై సీఎస్‌కే మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు. త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ఓపెన‌ర్లుగా సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్ చ‌క్క‌టి కాంబినేష‌న్ అని చెప్పుకొచ్చాడు. వారిద్ద‌రూ దూకుడుగా ఆడ‌తార‌ని అన్నాడు.

రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంస‌న్‌లకు మంచి నేపథ్యం ఉంది. వారిద్ద‌రూ ప‌రుగులు రాబ‌ట్ట‌గ‌ల‌రు. వారిద్ద‌రూ ఓపెనింగ్‌లో చెల‌రేగాల‌ని కోరుకుంటున్నాను. ఇక ఇద్ద‌రికి కూడా వేరు వేరు బ‌లాలు ఉన్నాయి. ఒక‌రు బంతిని సున్నితంగా బాదితే మ‌రొక‌రు మాత్రం చాలా బ‌లంగా కొడ‌తారు. అని అశ్విన్ తెలిపాడు.

Shane Warne : భారీ మొత్తానికి అమ్ముడుపోయిన రాజ‌స్థాన్.. షేన్ వార్న్ కుటుంబానికి జాక్‌పాట్‌.. కోట్ల రూపాయ‌లు

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ మొద‌టి మ్యాచ్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మార్చి 30న ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు గుహ‌హ‌టి ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఏప్రిల్ 3న పంజాక్ కింగ్స్‌, ఏప్రిల్ 5న ఆర్‌సీబీ, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో చెన్నై ఆడ‌నుంది.