Shane Warne : భారీ మొత్తానికి అమ్ముడుపోయిన రాజస్థాన్.. షేన్ వార్న్ కుటుంబానికి జాక్‌పాట్.. కోట్ల రూపాయలు
రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడంతో షేన్ వార్న్ (Shane Warne) కుటుంబానికి కోట్ల రూపాయలు సొంతం కానున్నాయి.
Shane Warne Family To Earn Rs 450 Crore After Rajasthan Royals Sale
- భారీ మొత్తానికి అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్
- షేన్ వార్న్ కుటుంబానికి జాక్ పాట్
- దాదాపు 460 కోట్ల రూపాయలు
Shane Warne : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్‌వార్న్ (Shane Warne ) కుటుంబానికి జాక్ పాట్ తగినట్లైంది. దాదాపు 460 కోట్లకు పైగా నగదు వార్న్ కుటుంబానికి దక్కనుంది.
ఎలాగంటే?
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్‌వార్న్ నాయకత్వం వహించాడు. ఆ సమయంలో అతడు ఆర్ఆర్కు కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గానూ వ్యవహరించాడు. కాగా.. జట్టుకు వార్న్ ఆడినంత కాలం ప్రతి ఏటా 0.75 శాతం యాజమాన్య వాటాగా కేటాయిస్తున్నట్లుగా అతడికి ఇచ్చిన కాంట్రాక్టులో ఉంది.
Kal Somani : ఎవరు బ్రో నువ్వు 15వేల కోట్లు పెట్టి కొన్నావ్.. RR కొత్త ఓనర్ బయోగ్రఫీ..
వార్న్ మొత్తం నాలుగు సీజన్ల పాటు ఆర్ఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. అంటే మొత్తంగా 3 శాతం వార్న్‌కు ఆర్ఆర్ ఫ్రాంఛైజీలో యాజమాన్య వాటాగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తరువాత ఆ వాటాలను విక్రయించడం ద్వారా సుమారు 450 నుంచి 460 కోట్ల వరకు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్‌ను షేర్ వార్న్ విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరోసారి ఆర్ఆర్ కప్పును ముద్దాడలేదు. ఇదిలా ఉంటే.. 2022లో షేన్ వార్న్ మరణించిన సంగతి తెలిసిందే.
