Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్.. ఫోటోలు వైరల్.. ఆమె కూడా క్రికెటరే
టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : June 4, 2023 / 10:09 AM IST
Ruturaj Gaikwad Married pics
Ruturaj Gaikwad-Utkarsha Pawar: టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు. శనివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుల సమక్షంలో వీరిద్దరు ఒక్కటి అయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుతురాజ్ గైక్వాడ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘స్టేడియం నుంచి మండపం వరకు మా జర్నీ మొదలైంది.’ అంటూ ఆ ఫోటోలను క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్లు, సెలబ్రిటీలు, నెటీజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో ఉత్కర్ష పవార్ జన్మించింది. ఆమె కూడా ఓ క్రికెటరే. దేశవాళీల్లో మహారాష్ట్ర తరుపున ఆడింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. తన 11 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్ (ఐఎన్‌ఎఫ్‌ఎస్)లో చదువుతోంది. కాగా.. రుతురాజ్, ఉత్కర్ష గత రెండు ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వేతో కలిసి చెన్నైకి అద్భుత ఆరంభాలను అందించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 590 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కి స్టాండ్ బైగా ఎంపిక అయ్యాడు. అయితే.. పెళ్లి కారణంగా తాను లండన్‌కు వెళ్లలేనని రుతురాజ్ బీసీసీఐకి సమాచారం అందించాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను లండన్‌కు పంపించింది బీసీసీఐ. ఐపీఎల్ టైటిల్‌తో రుతురాజ్, ఉత్కర్ష లు కలిసి ధోనితో కలిసి దిగిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
